ఏంటో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఈ లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చెడ్డ దారిలో వెళ్లాలని సూచించేవారు మంచివాళ్లు అవుతున్నారు. మంచిగా బ్రతకాలని బుద్ధి చెప్పే వారు మాత్రం  చెడ్డవాడిగా మారిపోతున్నారు నేటి రోజుల్లో. అయితే కలికాలంలో మంచికి రోజులు లేవు అని చాలా మంది చెబుతుంటారు. అయితే ఏదో  మాటవరసకు ఇలా అంటూ ఉంటారులే అని అనుకుంటూ వుంటారు చాలామంది. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. నేటి రోజుల్లో మంచికి రోజులు లేవు అన్న విషయానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారిపోయింది.


 సాధారణంగా  జీవితంలో ఎలా నడుచుకోవాలి ఏం చేస్తే బాగుపడతారు అన్న విషయంపై అప్పుడప్పుడు పెద్దలు పిల్లలకు సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు. మంచి దారిలో వెళ్లాలని మంచిగా బ్రతకాలని అందరి ప్రశంసలూ పొందాలి అంటూ సూచిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇలా పెద్దలు చెప్పిన  సమయంలో శ్రద్ధగా వినే వారు. కానీ నేటి రోజుల్లో యువత మాత్రం ఎవరైనా ఇలా మంచి చెడుల గురించి వివరించారు అంటే ఎదురు సమాధానం చెప్పడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇద్దరు విద్యార్థులు మరింత దారుణంగా ప్రవర్తించారు.


 మంచి దారిలో వెళ్లాలి అని గుర్తించినందుకు  ఏకంగా ప్రాణాలనే తీసేశారు. ఈ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. తాగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు చెడిపోవాద్దు అంటూ ఓ బామ్మా ఇద్దరు విద్యార్థులను మందలించగా.. మన బాగు కోసమే చెప్పింది కదా అని అనుకోకుండా ఏకంగా ఆ బామ్మ ప్రాణాలు తీశారు ఇద్దరు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి కి చెందిన పదో తరగతి బాలుడు మద్యానికి బానిస గా మారిపోయాడు. ఈ క్రమంలోనే చిన్న దొంగతనాలు చేస్తూ మద్యం తాగుతూ ఉండే వాడు. ఇటీవలే అతని పుట్టినరోజునాడు స్నేహితుడు నవీన్ తో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే వీరిని గమనించినా 73 ఏళ్ల వృద్ధురాలు నాగమ్మ ఈ వయసులో ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటి.. తాగి చెడిపోదు బాబు అంటూ వారిని మందలించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఇద్దరు కూడా ఆ వృద్ధురాలిపై దాడి చేసి చివరికి ప్రాణాలు తీశారు. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: