మద్యం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మద్యం తాగే వాళ్ళు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు తప్ప మద్యాన్ని దూరం పెడుతున్న వారు మాత్రం ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి. అయితే చాలామంది మద్యం తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో మద్యం మత్తు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో మంది మద్యం మత్తులో వాహనాలు నడపడం చివరికి రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.


 ఇటీవలే మద్యం మత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది..మద్యం మత్తు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కొడుకు మారాం చేస్తున్నాడు అని ఏకంగా  బైక్ ఇప్పించాడు తండ్రి. కానీ ఆ బైక్ ఆ కొడుకు ప్రాణం తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. ఇటీవల ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.. దీనితో అక్కడికక్కడే చనిపోగా మరొకరు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.


 హైదరాబాద్ నగరంలోని సూరారం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అబ్బాస్ అనే 20 ఏళ్ల యువకుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. ద్విచక్ర వాహనం కావాలంటు కొన్ని నెలల నుంచి తల్లిదండ్రులు తరచూ అడిగే వాడు. కొడుకుకోసం ఇటీవల తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ద్విచక్ర వాహనం కొనీచ్చారు. ఈనెల 25వ తేదీన  స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉన్న సమయంలో చివరికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన సాయి కిరణ్ తీవ్రగాయాలు అవగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అబ్బాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: