సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కోట్ల రూపాయలను మోసపోయారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబుని ప్రియదర్శిని వివాహం చేసుకుంది. తాను ఇప్పుడు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల వరకు మోసపోయినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రియదర్శిని. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో శిల్వా చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఇండస్ట్రీలో ఎంతో మందిని శిల్పా చౌదరి నిలువునా ముంచేశారు. అధిక వడ్డీలు ఆశ చూపించిన శిల్పా... కోట్ల రూపాయలను ప్రముఖుల నుంచి వసూలు చేసింది. శిల్పా చౌదరిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శిల్పా చౌదరి చేతిలో మోసపోయామంటూ ఇప్పటికే టాలీవుడ్‌లోని ముగ్గురు సెలబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో శిల్పా చేతిలో మేము కూడా మోస పోయామంటూ చాలా మంది ప్రముఖులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా శిల్పా చౌదరీలో  తాను కూడా మోసపోయినట్లు ప్రియదర్శిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన నుంచి శిల్పా చౌదరీ ఏకంగా 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నారని... ఆ తర్వాత డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి వారం కిట్టీ పార్టీలకు తనను శిల్పా ఆహ్వానించిందన్నారు. తన వద్ద డబ్బు తీసుకున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం డబ్బుల కోసమే కిట్టీ పార్టీలను శిల్పా చౌదరి దంపతులు ఏర్పాటు చేసేవారని... అలా తన నుంచి ఇప్పటి వరకు మొత్తం 2.9 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు ప్రియదర్శిని. ప్రిన్స్ సోదరి ప్రియదర్శిని ఫిర్యాదుపై శిల్పా చౌదరిని మరోసారి విచారించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఆ డబ్బులను ఎక్కడ ఉంచారనే విషయంపై విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా బాధితుల్లో మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు ప్రముఖుల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలను వసూలు చేసిన శిల్పా... ఆ డబ్బును హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ డబ్బును తిరిగి తెప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: