ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో నగర వాసులు అందరూ కూడా దొంగలు అని పేరు చెబితే  జాగ్రత్తగా ఉంటారు కానీ అంతలా భయపడిపోయారు. కానీ ఈ దొంగల ముఠా పేరు చెబితే మాత్రం అందరికీ భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే వారు చేసే దారుణాలు అలాంటివి. చెడ్డీలు వేసుకుని దొంగతనానికి వస్తారు. ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. వాళ్ళు ఎవరో కాదు చెడ్డి గ్యాంగ్. హైదరాబాద్ నగరంలో చెడ్డీగ్యాంగ్ ఎంత హాల్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 హైదరాబాద్ శివార్లలో దొంగతనాలకు పాల్పడుతు పోలీసుల కే సవాలు విసిరారు. దీంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ చెడ్డి గ్యాంగ్  పేరు చెప్తే చాలు హడలిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గతంలో హైదరాబాద్ నగరంలో హల్చల్ సృష్టించిన చెడ్డీగ్యాంగ్ ఇక ఇప్పుడు కృష్ణాజిల్లాలో ప్రత్యక్షమైంది. ఇటీవలే అర్ధరాత్రి సమయంలో తిరుగుతూ హల్చల్ చేస్తూ ఉండడంతో స్థానికులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా చేతిలో కర్ర లు పట్టుకుని రెడ్ల పై తిరుగుతూ అపార్ట్మెంట్లో ప్రవేశించడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. విజయవాడ చిట్టినగర్ లో చెనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివ దుర్గ అపార్ట్మెంట్స్ సీసీ కెమెరాల్లో చెడ్డి గ్యాంగ్ కు సంబంధించిన ఫొటోస్ రికార్డు అయింది.  అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి డబ్బు బంగారాన్ని చెడ్డీగ్యాంగ్ చోరీ చేసింది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొండపల్లి గ్రామంలో అపార్ట్మెంట్లో కూడా చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేయడం గమనార్హం . ఏకంగా ఐదుగురు సభ్యులు చెడ్డీ వేసుకొని కర్రలు చేతపట్టుకుని అపార్ట్మెంట్లో ప్రవేశించారు  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇక అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు  చెడ్డి గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: