మనిషి సృష్టించిన డబ్బు ఇక ఇప్పుడు మనిషిని శాసించే స్థాయికి వెళ్లింది.. ఏకంగా మనిషి ప్రాణాలను కూడా విలువ లేదు కానీ డబ్బుకు అంత కంటే ఎక్కువ విలువ ఉంది.  సభ్యసమాజంలో ఇటీవలి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి డబ్బు ఒక రకంగా కారణం అవుతుంది అనే చెప్పాలి. ఆర్థిక సమస్యల కారణంగా సతమతమై మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది. ఆర్థిక సమస్యల కారణంగా ఎన్నో ప్రాణాలు పోతుంటే ఎన్నో కుటుంబాలు శోకసముద్రంలో మునిగి పోతున్నాయి. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది.



 మరో 20 రోజుల్లో ఆ యువకుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇరు కుటుంబాలు. ఇక పెళ్లి కార్డులు కూడా ముద్రించి  ఇంటికి తీసుకు  వచ్చారు. కానీ అంతలోనే అతనికి ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంక్ నిర్వాహకుల నుండి ఒత్తిడి పెరిగిపోయింది. అదే సమయంలో పెళ్లికి కూడా డబ్బులు లేక పోవడంతో మనస్తాపం చెందాడు ఆ యువకుడు. చివరికి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


 ఈ ఘటన రాజేంద్రనగర్లో వెలుగు లోకి వచ్చింది రాజేంద్రనగర్ పరిధిలో శివరాం పల్లికి చెందిన అవినాష్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అయితే ఇటీవలే నగరానికి చెందిన యువతి తో 26వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్ల లో భాగంగా పత్రికలు ముద్రించి ఇంటికి తీసుకు వచ్చారూ తల్లి దండ్రులు. అవినాష్ రెండు ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకోగా సకాలం లో చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అదే సమయం లో అటు పెళ్లికి డబ్బు కూడా సమకూరదు. దీంతో మన స్తాపంతో రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: