ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపించాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే పాఠశాలకు వెళ్లిన పిల్లలు మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తారా లేదా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో ఎంతోమంది స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి తల్లిదండ్రులు భారీగా డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఇప్పటికే చాలా చోట్ల స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటనలు కలకలం సృష్టించాయి . ఇక మరికొన్ని ప్రాంతాలలో ఏకంగా స్కూల్ పిల్లలు చిన్న వయసులోనే చేయకూడని పనులు చేస్తున్నారు.


 హాయిగా పాఠశాలకు వెళ్ళి చదువుకొని ఇంటికి రాకుండా పెడదారి పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎక్కడ విషయం తెలిసిపోతుంది అని భయపడి పోయి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారి పోవడం లాంటివి కూడా చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన లో మునిగి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా  నలుగురు విద్యార్థులు ఒక్క సారిగా కనిపించకుండా పోవడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



 గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా నలుగురు విద్యార్ధుల అదృశ్యం కావడం తో  కుటుంబ సభ్యులందరూ ఆందోళనలో మునిగిపోయారు. పిల్లల ఆచూకీ కనుగొనాలి అంటూ పోలీసులు దగ్గరికి పరుగులు పెట్టారు తల్లిదండ్రులు. ఉదయం స్కూలుకు వెళ్లిన విద్యార్థులు బ్యాగులు అక్కడే పెట్టి బయటకు వెళ్లారు. అయితే తిరిగి సాయంత్రం స్కూల్కి వస్తుండగా ఉపాధ్యాయులు గమనించారు. దీంతో ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తాం అంటూ నలుగురు విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇక తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అనే భయంతో వెంకట్, ప్రభుదేవా,,  సంతోష్, వెంకీ అనే నలుగురు విద్యార్థులు కూడా కనిపించకుండా పోయారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: