భారతదేశంలో మొదటిసారిగా గుర్తించబడిన ఓమిక్రాన్ కేసు ఎవరిదో తెలుసా ? అతను ఒక దక్షిణాఫ్రికా జాతీయుడు. ఆతను మహా తెలివి మంతుడు. ప్రస్తుతం అతనిపైన, అతను నివాసం ఉన్న పైవ్ స్టార్ హోటల్ పైనా కేసు నమోదైంది. ఎందుకో తెలుసా ? అతను భారత్ నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించాడు. కోవిడ్-19 వచ్చిన వారం రోజుల తర్వాత భారతదేశం విడిచిపెట్టి వెళ్లి పోయాడు.

దక్షిణాఫ్రికా దేశస్థుడిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు, అతను భారతదేశపు మొదటి ఓమిక్రాన్ కేసుగా గుర్తించబడ్డాడు మరియు తరువాత బెంగళూరు నుండి దుబాయ్ వెళ్లిపోయాడు.    అతను బెంగళూరులో బస చేసిన షాంగ్రిలా హోటల్ నిర్వాహకుడి పేర్లు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. ఎఫ్.ఐ.ఆరో లో నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు నవంబర్ 20 న బెంగళూరుకు వచ్చాడు. అక్కడి  విమానాశ్రయంలో  నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతను బెంగళూరులోని షాంగ్రిలా అనే హోటల్‌కి వెళ్లాడు. అతనిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని బిబిఎంపి  అధికారులు హోటల్ సిబ్బంది కి, దక్షిణాఫ్రికా దేశస్తునికి తెలిపినట్లు ఎఫ్ఐఆర్ లో వివరాలు పేర్కోంటున్నాయి.

అయితే,  ఆతను  క్వారంటైన్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హోటల్ సిబ్బందికి చెప్పినప్పటికీ, నవంబర్ 27న బయటకు వెళ్లిపోయాడు.  హోటల్ సిబ్బందికి   అతను కోవిడ్ -19 నెగటివ్ రిపోర్టును  చూపించి , రూం ఖాళీ చేసి వెళ్లిపోయాడు. హోటల్ నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి  టాక్సీ కారుతీసుకుని వెళ్లి పోయాడని హోటల్ సిబ్బంది పోలుసు అధికారులకుతెలిపారు.  అక్కడ నుంచి అతను దుబాయ్ వెళ్లిపోయి ఉంటాడని హోటల్ సిబ్బంది తెలిపారు. అతను దేశం విడిచి వెళ్లి పోయిన ఆరు రోజుల తరువాత అతనికి ఓమిక్రాన్ ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికా దేశస్తుడు భారత్ నుంచి పారిపోయిన తరువాత అప్రమత్తమైన అధికారులు హోటల్ సిబ్బందితో పాటు,  ప్రైమరీ కాంట్రాక్టులుగా ఉన్న 24 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా  సెంకడరీ కాంట్రాక్టులను గుర్తించారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించారు.  వీరందరికి సంబంధించిన వైద్య రిపోర్టులు రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: