హైదరాబాద్‌ ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో  ల‌భ్య‌మైన కుళ్లిన  డెడ్ బాడీ  అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేవిధంగా చేసిన‌ది.  దాదాపు ఆ శవం నీళ్లలో 40 నుంచి 50 రోజుల వ‌ర‌కు ఉండొచ్చ‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని వేల కుటుంబాలు గత కొద్ది వారాలుగా డెడ్ బాడీ కుళ్లుతున్నా అలాగే నీటిని  తాగుతున్నారు. అసలు ఆ వాటర్ ఇక్కడికి ఎక్కడినుంచి స‌ర‌ఫ‌రా అవుతుంది, ఇక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లోకి ఎలా ప్రత్యక్షమైన‌ది అనే  దానిపై చేప‌ట్టిన గ్రౌండ్ రిపోర్ట్‌లో కొన్ని  కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నగరం నడిబొడ్డున ముషీరాబాద్ పరిధిలో కొన్ని వేల కుటుంబాలు కుళ్లిన శవం పడిన నీటినే మంచి నీరు తాగుతూ వచ్చారు దాదాపు నెల‌న్న‌ర వ‌ర‌కు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే మంచినీరు స‌ర‌ఫ‌రా అవుతున్న‌ది. అయితే రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌కు కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరా జ‌రుగుతుంది. 1980లో తొలుత 100 కుటుంబాలతో ప్రారంభమైన‌.. ఎస్‌.ఆర్‌.కే. కాల‌నీ సొసైటీకి చెందిన 600 గజాల స్థలాన్ని కాలనీ అవసరార్థం కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కేటాయించారు. 1985-90 ఈ మధ్యకాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తిగా మెయింటెన్ లేకపోవడంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని తేటతెల్లమైన‌ది.

నిత్యం యువకులు మద్యం సేవించడం, సిగరెట్, గంజాయి ఇతర మత్తుపదార్థాలను తాగడానికి, స్త్రీ పురుషులు కలిసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి  ఈప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. అదేవిధంగా  పలుమార్లు దీనిపై కాలనీవాసులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిన‌ద‌ని టాక్‌. మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న త‌రుణంలోనే..  రీసాల గ‌డ్డ వాట‌ర్ ట్యాంక్ మృత‌దేహంపై స‌స్పెన్స్ వీడింది. ముషీరాబాద్‌కు చెందిన కిషోర్‌గా గుర్తించారు.  ఘ‌ట‌న స్థ‌లంలోని చెప్పుల ఆధారంగా ఆయ‌న సోద‌రి గుర్తించింది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా గొడ‌వ పెట్టుకొని బ‌య‌టికి వెళ్లాడు. ముషీరాబాద్‌కు చెందిన కిషోర్ గా పోలీసులు తేల్చి చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: