సాధారణంగా షాప్స్‌లో, ఇంట్లో దొంగతనాలు జరుగుతుండటం సహజం. కానీ మనతో నమ్మకంగా ఉంటూ వారింటికే కన్నం వేసిన సంఘటనలు చాలానే చూస్తాము. తాజాగా అదేకోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సీఆర్ కుప్పంలో సురేష్ బాబు నివాసం ఉంటున్నాడు. ఇక తిరుపతిలోని ప్రముఖ సూపర్ మార్కెట్ మోర్‌లో మేనేజర్‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే చాల కాలం అక్కడే పనిచేసిన సురేష్ బదిలీపై పుత్తూరు శాఖకు వెళ్లిపోయాడు. ఇక ఆదివారం రాత్రి మోర్ సూపర్ మార్కెట్‌లో భారీగా దొంగతనం జరిగింది. అయితే వేసిన తాళం వేసినట్లే ఉన్నట్లు.. సెక్యూరిటీ సైరన్ మ్రోగలేదు.. కానీ క్యాష్ కౌంటర్‌లో పెట్టిన సొమ్ము మాత్రం మాయమైనట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిందని గుర్తించిన కొత్త మేనేజర్ మంజునాథ్ చోరీ వెంటనే తనపై అధికారులకు సమాచారం అందించారు. షాప్‌లో మొత్తం రూ.2.7 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి ఎంఆర్ పల్లి పోలీసులకు పేర్కొన్నారు.

బాధితుడు ఫిర్యాదు మేరకు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అంతేకాదు.. తాళాలు వేసే ఉండటం, సూపర్ మార్కెట్‌లో కాసేపు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనేనని అనుకున్నారు. దీంతో సీసీ కెమెరాలకు పవర్ కట్ అయిన ముందు రికార్డ్ అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా షాకింగ్ సంఘటన కనిపించింది.

అయితే దొంగ ముందుగా సూపర్ మార్కెట్ షట్టర్‌ను తాళాలతోనే ఓపెన్ చేసి.. సీసీ కెమెరాలకు సప్లై అయ్యే పవర్ ప్లగ్‌లను తీసేసి ఆ తర్వాత నేరుగా లాకర్ వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న డమ్మీ తాళంతో లాకర్‌ను ఓపెన్ చేసి డబ్బు తీసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. షాప్‌లో కెమెరాలు స్విచ్ఛాప్ చేయక ముందు కనపడిన దృశ్యాల మేరకు పాత దొంగ ఎవరో కాదు గతంలో మేనేజర్ పనిచేసిన సురేష్ బాబే గుర్తించినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: