ఓ యువకుడు తన విలాసాల కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడుఇద్దరు అక్కాచెల్లెళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం గడిచిన తరువాత ఆ యువకుడి జీవితంలోకి మరో యువతి వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడిని కఠినంగా శిక్షించాలని అనుకున్నారు. ఓ రోజు అతడిని ఇంటికి పిలిచి బాగా మందు తాగించి దారుణంగా హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా బగాడి గ్రామానికి చెందిన ముకేశ్ అనే యువకుడు లలిత, సరిత(పేర్లు మార్చబడినవి) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ ఇద్దరు యువతులను సంవత్సరం క్రితమే వారి భర్తలు వదిలి వెళ్లడంతో..  ఆ ముగ్గురూ యద్ధేచ్ఛగా జీవిస్తున్నారు. కాగా.. ఒకరోజు ముకేశ్‌ మరో యువతిని ప్రేమిస్తున్నాడని లలిత, సరితలకు తెల్సిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడిని అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇద్దరు అక్కచెల్లలు ఒకరోజు ముకేశ్‌ని ఇంట్లో మందు పార్టీ పేరుతో ఇంటికి రప్పించారు. ఇద్దరు ఇంట్లో ముకేశ్‌కి బాగా మందు తాగించి బయటకు తీసుకొచ్చారు. అతడిని ఊరి చివర వెళ్లి అక్కడ రాళ్లతో అతడి తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం పాత బడ్డ బావిలో ముకేశ్ శవాన్ని పడేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే వారం రోజుల తరువాత బావిలో నుంచి వాసన రావడం చూసి చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ముకేశ్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా.. లలిత, సరితలను అనుమానంతో అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక చివరికి వారిద్దరూ హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో పోలీసులు వారిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: