ఎదుటి వ్యక్తులు ప్రమాదంలో ఉంటే సహాయం చేసే గుణం ప్రతి మనిషి లో ఉండేది.. ఇక తెలియని వారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటే సహాయం చేసి  ప్రాణాలను రక్షించే జాలీ దయా గుణం మనిషి లో కనిపించేది. కానీ ఇవన్నీ ఇప్పుడు మనుషుల్లో ఎక్కడా కనిపించడం లేదు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి ఇక ఇప్పుడు మానవ మృగం గా మారిపోతున్నాడు. జాలి దయ అనేది మరిచి ఉన్మాదిగా మారిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనకడుగు వేయడం లేదు మనిషి. చాక్లెట్ తిన్నంత  సులభంగా మనిషి ప్రాణాలను గాల్లో కనిపిస్తున్నాడు.


 హత్యకు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయని భయం ఎవరి లో కనిపించడం లేదు. కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా మానవత్వాన్ని చూపించడంలేదు మనిషి. ఈ క్రమంలోనే ఏకంగా దారుణంగా హత్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో పండగ పూట ఊహించని దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వెల్గటూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య అనే వ్యక్తిని కుమారుడు పవన్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. చంద్రయ్య ఇటీవలికాలంలో మద్యానికి బానిస గా మారిపోయాడు. తరచూ తాగి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడుతూ ఉండేవాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల గురువారం పండగ అని కూడా చూడకుండా మరోసారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు. భార్య లక్ష్మి తో గొడవ పడుతూ దారుణంగా తిడుతూ ఉన్నాడు.  దీంతో ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు పవన్ ఓపిక  నశించి కోపంతో ఊగిపోయాడు. ఇక ఇంట్లో ఉన్న కర్రతో తండ్రి చంద్రయ్య పై దాడి చేశాడు. ఈ దాడిలో చంద్రయ్య తలకు పెద్ద గాయం అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు చంద్రయ్య.  దీన్ని గమనించిన పవన్ ఇంట్లో నుంచి భయంతో పారిపోయారు. ఇక మృతుని భార్యలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: