సాధారణంగా దేవతలకు జంతు బలులు ఇవ్వడం ఎన్నో రోజుల నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గొర్రెలు మేకలు లాంటివి దేవతలకు బలి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇక ఏదైనా పండుగ వచ్చిందంటే గుడి ముందు ఇక ఇలా జంతువులను బలి ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇలాంటిదే చేయాలి అని అనుకున్నారు కొంతమంది గ్రామస్తులు. గొర్రె పొట్టేలును బలి ఇవ్వాలని అనుకుంటే  జరగకూడని అనర్థం జరిగిపోయింది. మనిషి తల నరికేసాడు ఇక్కడ ఒక వ్యక్తి. అయితే ఇంత అనర్థం జరగడానికి మద్యం మత్తు కారణంగా తెలుస్తోంది.


 అచ్చంగా గొర్రె పొట్టేలు తల నరికి చేసినట్లుగానే ఆ గొర్రె పొట్టేలు పట్టుకొని పక్కనే నిలబడ్డ మనిషి తల నరికేశాడు. దీంతో ఒక్కసారిగా మనిషి తల తెగి పడటంతో అక్కడున్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు.  అందరికీ గగుర్పాటుకు  గురి చేస్తున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం లో వెలుగులోకి వచ్చింది. మదనపల్లె మండలంలోని వలసపల్లి లో ఆనవాయితీగా దేవతలకు జంతుబలి ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల పండగ పూట ఎల్లమ్మ దేవత కు పొట్టేలును బలి ఇవ్వడానికి ఊరి వాళ్ళందరూ సిద్ధమయ్యారు.


 ఈ క్రమంలోనే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఉన్న ఒక వ్యక్తి పొట్టేలు తల నరకడానికి కత్తిని చేతుల్లో పట్టుకున్నాడు. దేవత గుడి ముందు పొట్టేలు ఎక్కడికి పారిపోకుండా ఒక వ్యక్తి పట్టుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తల నరకబోయి ఏకంగా ఆ గొర్రె పొట్టేలు ను పట్టుకున్న వ్యక్తి తల నరికేశాడు. దీంతో తల తెగి కింద పడిపోయింది. ఇక సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇది నిజంగానే మద్యం మత్తులో జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: