ఓ తల్లి, తనఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని యదేహళ్లి ప్రాంతానికి చెందిన వీణ(32) అనే వివాహితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక పాపకు ఏడేళ్లు, మరో పాపకు ఏడాది వయసు ఉంటుంది.

వీణ సంక్రాంతికి సొంతూరు వెళుతున్నానని భర్తకు చెప్పి జనవరి 13న పిల్లలను తీసుకుని ఇంటి నుండి బయటికి వచ్చింది. అయితే మృతదేహం జనవరి 14న హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో వీణా మృతదేహం లభ్యమైంది. ఇక  ఏడేళ్ల పాప మృతదేహం కూడా మరోచోట లభ్యం కాగా.. ఏడాదిన్నర పాప మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మృతురాలి భర్త ఫిర్యాదుతో హొలేహోన్నురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే హొలేహోన్నురు సమీపంలోని అరహతొళలు గ్రామానికి చెందిన సంతోష్, అతని భార్య ఆషా తన భార్యాపిల్లల ఆత్మహత్యకు కారణమని వీణ భర్త ఫిర్యాదులో వెల్లడించారు. ఇక వీణకు తెలిసిన వాళ్లు కావడంతో.. ఆ భార్యాభర్తలకు 8 లక్షల రూపాయలు అప్పుగా తన భార్య ఇచ్చిందని ఆమె భర్త చెప్పుకొచ్చాడు. ఆ దంపతులను డబ్బులు ఇవ్వమని వీణ అడగ్గా.. వారి డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. అంతేకాకుండా.. వీణ, సంతోష్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని సంతోష్ భార్య ఆషా తప్పుడు ప్రచారం చేసింది.

ఆషా సృష్టించిన పుకార్లకు వీణ మానసికంగా కుమిలిపోయిందని వీణ భర్త చెప్పుకొచ్చాడు. వీణతో పుకార్లను పట్టించుకోవద్దని తాను ధైర్యం చెప్పినప్పటికీ ఆ పరిణామం తన భార్యను మానసికంగా కుంగదీసిందని వీణ భర్త ఫిర్యాదులో వెల్లడించాడు. ఇక వీణ అమ్మ వాళ్లింటికి వెళతానని భర్తకు చెప్పి ఇద్దరు పిల్లలను తీసుకుని హంచిన సిద్ధాపుర సమీపంలోని భద్రా కాలువలో పిల్లలిద్దరినీ తోసి, ఆమె కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: