పెళ్లి అనేది అమ్మాయి అబ్బాయి జీవితంలో ఓ కీలక ఘట్టం అనే చెప్పాలి. వివాహం జరిగిన తరువాత భార్యాభర్తలిద్దరూ చిలకా గోరింకల్లా కలకాలం కలసి జీవించాలని అందరూ కోరుకుంటారు. కానీ నేటి సమాజంలో అనుమానంతో చిన్న చిన్న విషయాలకే హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన చంద్రశేఖర్, వనజ దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుండి తిమ్మాపురంలోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చంద్రశేఖర్‌కు తన భార్య వనజ అంటే చాలా ఇష్టం. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తుండేవారు. ఇక ఇటీవల ఇద్దరి మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. వీరిద్దరి మధ్య తరచూ గొడవడటం పిల్లలు ఎడవటంతో మళ్లీ కలిసిపోతుంటారు.

ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో ఏమోగానీ.. చంద్రశేఖర్‌కు భార్యపై అనుమానం పెరిగిపోయింది. దాంతో భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెను ఎప్పుడు అనుమానిస్తూనే ఉండేవాడు. ఇక ఈ విషయంపై కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఈసారి వారిద్దరూ కలిసిపోలేదు. చంద్రశేఖర్ భార్యపై కోపంతో కత్తితో పొడిచి హత్యచేసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటన స్థలానికి వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వనజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించగా.. చంద్రశేఖర్ ను పుత్తూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు క్షణికావేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఇద్దరు పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: