పెళ్లిళ్ల కోసం కొన్ని మ్యాట్రిమోనియల్ సైట్ లో వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నిజమైనవి ఉంటే మరి కొన్ని మాత్రం నకిలివి ఉంటాయి. అలాంటి వాటిని నమ్మి కొందరు మోస పోతే మరి కొంతమంది మాత్రం అనేక మొసాలకు దిగితున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి నిత్య పెళ్ళి కోడుకుగా అందరినీ మోసం చేసి ఒకటి కాదు రెండు కాదు ఎకంగా 40 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఫిర్యాదు వల్ల అడ్డంగా బుక్కయ్యాడు.. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.


విశాల్ చవాన్ ,అలియాస్ అనురాగ్ చవాన్, తాను పెద్ద వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ వరుస పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.40 మందిని పెళ్ళి చేసుకున్నాడు. అసలు విషయాన్నికొస్తే..గతేడాది నిందితుడు చవాన్ మ్యాట్రిమోని సైట్‌ ద్వారా కుంజుర్‌మార్గ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళతో పరిచయం చేసుకున్నాడు. తనను తాను పారిశ్రామికవేత్తగా చెప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఫోన్‌లోనే మాట్లాడి మభ్యపెట్టాడు.. అలా ఆమె నుంచి మూడు లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ చేశాడు.. అలా ఒకరి తో ఏకంగా 40 మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకొని పార్టీ మార్చాడు..


అది తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. చవాన్ గుర్తింపు కార్డులు, సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ ఫేక్ అని తేల్చారు.. మాయ లోడును పట్టుకోవడానికి పోలీసులు బాగానే కష్ట పడ్డారు.శ్రద్ధా మహల్ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ లో డెలివరీ బాయ్ గా మారారు. సినిమా స్టైల్ లో పక్కా ప్లాను వేశాడు.రెండేళ్లలో చవాన్ 35,40 మంది మహిళల నుంచి రూ. 15-20 లక్షల వరకు తీసుకున్నట్లు పోలీసుల విచారణ లో తేలింది. రెండేళ్లలో చవాన్ 35-40 మంది మహిళల నుంచి రూ. 15,20 లక్షల వరకు వుంటుందని అంచనా వేశారు.గతం లో కూడా ఇతని పై ఇలాంటి కేసులు నమోదు అయినట్లు పోలీసుల రికార్దు నిర్ధారణ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: