మనుషులు పైపైకి సాదాసీదాగా కనిపించిన కొంతమందిలో మాత్రం ఊహించని రీతిలో వికృత రూపాలు దాగి ఉంటాయి అని అంటూ ఉంటారు జనాలు. ఇక కొన్ని కొన్ని ఘటనలు చూసిన తరువాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనిషిలో దాగిఉన్న వికృత రూపం బయటికి వచ్చి ఎన్నో దారుణాలకు కారణమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే చత్తీస్ ఘడ్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. అతను ఓ యువతిని ప్రేమించాడు. పెళ్ళికూడా చేసుకున్నాడు. కానీ పెళ్లయిన పది రోజులకే భార్యను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది.


 అంతే కాదు భార్య శవాన్ని ఇంట్లో పాతి పెట్టి హాయిగా మద్యం సేవించేందుకు వెళ్ళాడు ఆ యువకుడు. ఇక యువకుడి తల్లి ఇంటికి చేరుకోవడంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది.  లక్ష్మీ పార పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న  చిత్ర లేఖ  సంతోషి పారా లో నివాసముంటున్న వివేక్ గుప్తాను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం తర్వాత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని భావించింది. ఈ క్రమంలోనే కుటుంబం నుంచి విడిగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు.


 అయితే ఇటీవలే వివేక్ తల్లి కొడుకు ను చూసేందుకు వెళ్లగా.. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో ఏం జరిగి ఉంటుందా అని  కిటికీలోంచి చూసేసరికి భయంకర దృశ్యం షాక్ కీ గురిచేసింది.  వివేక్ తల్లి నేలపై పడి ఉన్నా చిత్రలేఖ మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూశారూ. అయితే శరీరంలో చాలా బాగాల్లో వాపు వచ్చింది. రక్తం కూడా కారుతోంది. శరీరం నీలం రంగంలోకి మారిపోయింది. ఈ క్రమంలోనే వివేక్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: