ఈ సభ్య సమాజం తీరు ఎటు పోతుంది బాసు అని ఎవరినైనా అడిగితే.. ఏమో గురు నాక్కూడా అదే అర్థం కావడం లేదు అంటూ కాస్త కన్ఫ్యూజన్ లోనే సమాధానం చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఇంత కన్ఫ్యూజన్ కి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే అని చెప్పాలి. ఒకప్పుడు సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు ఎక్కువగా కనిపించేవారు. ముక్కు మొఖం తెలియని మనిషి ప్రమాదం లో ఉన్నాడు అని తెలిసిన సహాయం అందించడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన నేటి లోకంలో పైపైకి మనుషులు మంచి వాళ్ళలా నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఎలాంటి కుట్రలు పన్నుతున్నారని ఊహకందని విధంగా మారిపోయింది.


 ఇప్పుడైతే అప్పుడు వరకు నవ్వుతూ మాట్లాడిన వారే చివరికి ప్రాణాలు తీసే ఉన్మాదులు గా మారిపోతున్న ఘటనలు కూడా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్న చిన్న కారణాలకే  మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి దాపురించింది అని చెప్పాలి. ఇప్పుడు జరిగిన ఘటన చూసిన తరువాత మాత్రం ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకోక తప్పదు.


 చిన్న కారణానికి ఏకంగా ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో  పొడిచి హత్య చేయబోయాడు ఇక్కడ ఒక వ్యక్తి. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థి తన స్నేహితులతో కలిసి దుర్గాప్రసాద్ అనే యువకుడు పై కత్తితో దాడి చేశాడు. దుర్గ ప్రసాద్ తన గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడు అన్న కోపంతో అతని మాటల్లో పెట్టి అత్తాపూర్ లోని మూసీ నది వద్దకు తీసుకెళ్లి అక్కడ కత్తితో దారుణంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన దుర్గా ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు.  కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: