ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకు మనస్థాపం చెంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనిషిలో ఆలోచన శక్తి తగ్గిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి తలుచుకుంటే తీరిపోయే సమస్యలకే భయపడిపోతున్నారు మనుషులు. అక్కడితో జీవితం అయిపోయిందని..  ఇక ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అంటూ భావిస్తున్నారు.


 ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం లో కూడా ఎంతోమంది చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ ఉన్నాను అన్న విషయం తెలిసిందే. నొప్పి లేకుండా ప్రాణం పోవడం ఎలా అని ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ యువతి ఇలాంటిదే చేసింది. సాధారణంగా ఎవరైనా సరే జలపాతం దగ్గరికి వెళ్ళారు అంటే అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అని అనుకుంటారు ఎవరైనా. ఇక అందరూ కూడా ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక యువతి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికే జలపాతం దగ్గరికి వెళ్ళింది.


 వంద అడుగుల ఎత్తైన జలపాతం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్ ఘడ్ లో  వెలుగులోకి వచ్చింది. ఇంద్రావతి నది పై ఉన్న చిత్రకూట్ జలపాతం వద్దకు గుర్తు తెలియని యువతి వచ్చింది. అయితే కాసేపు వాటర్ఫాల్ చివరణ  నిలబడింది. ఆ సమయంలో ఆమెను కొంతమంది ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిం.ది చివరికి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను వెతికినా మృతదేహం మాత్రం లభించలేదు.. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఆ యువతి ఎవరు అన్న దానిపై ఆరా తీస్తూ ఉండటం గమనార్హం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: