ఇటీవల కాలంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్ళు  వినూత్నమైన దారులను వెతుకుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే   ఏకంగా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సరికొత్తగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అటు పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేస్తూ చివరకు కటకటాల వెనక్కి తోస్తూ ఉన్నారు. అయినప్పటికీ గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఎవ్వరూ వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.


 ఇటీవలే కోరాపుట్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పాలి. అధికారుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. కొబ్బరికాయ లోడుతో ఒక ట్రక్కు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న వైపు వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడున్న వారు చూసి అది నిజంగానే కొబ్బరికాయలు లోడు ఉన్నా ట్రక్ అని అనుకున్నారు. కానీ పోలీసులు తనిఖీ చేస్తే గానీ అసలు విషయం బయట పడలేదు. కొబ్బరికాయ లోడు అంటూ చెప్పినా ట్రక్ లో 16 క్వింటల్లా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు  గుర్తించిన పోలీసులు ఇక దానిని స్వాధీనం చేసుకున్నారు.


 జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు పోలీసులు. ఈ క్రమంలోనే కాస్త అనుమానాస్పదం గా కనిపించడం తో ఇంకా వేగంగా వెళ్తున్న ట్రక్ ను తమ వాహనం  తో నిలువరించారు. సోదా చేయగా వంద బస్తాలు కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు కూడా బయట పడటం గమనార్హం. దాదాపు వీటిలో 80 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బీహార్కు చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్ ను ఈ కేసు లో అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: