నేటి రోజుల్లో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ ఒక్కటే. అదే ఆత్మహత్య అవును. నేటి రోజుల్లో మనుషులు ఇలాగే ఆలోచిస్తున్నారు. మరి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కునే మనుషులు ఇక ఇప్పుడు మరో చిన్న సమస్యకే భయపడిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న నేపథ్యంలో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఓ యువకుడు సహజీవనం చేస్తున్న యువతిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు.


 కానీ అంతలో ఏం జరిగిందో తెలియదు గానీ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలిసిన యువతి చివరికి రైలు పట్టాల పై పడుకొని సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ పోలీసులు సరైన సమయంలో స్పందించడంతో చివరికి ఆ యువతిని కాపాడగలిగారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఏపీ లోని కడప జిల్లా కొండాపురం కి చెందిన విజయ్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.


 రైల్వే స్టేషన్ లో మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్యకు దూరంగా ఉండడంతో సమీప ప్రాంతంలో ఉన్న ఓ మహిళకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లిలో ఒక అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని సహజీవనం  చేస్తున్నారు. అయితే ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఆ మహిళకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. దీంతో షాకైన మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు విజయ్ కుమార్ ను ఆ మహిళను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడగా మహిళా ఎంఎంటీఎస్ రైలు కింద పడి పట్టాలపై పడుకుంది. కానీ పోలీసులు స్పందించడంతో ప్రాణాలతో బయట పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: