ఇటీవలి కాలంలో మనుషులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే ఇక మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుని జల్సా చేయడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కేటుగాళ్లు ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మోసం చేయడానికి అనేకమైన దారులను వెతుకుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో సైబర్ ఎటాక్స్,హనీ ట్రాప్, ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ లో భాగంగా ముందుగా అందమైన యువతులతో మాట్లాడించి ముగ్గులోకి దింపి ఆ తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఇక ఆ వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు గుంజడం లాంటి చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.  ఇటీవలే భోపాల్ పోలీసులు హనీట్రాప్ పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేశారు. 2018 లో ఒక డాక్టర్ తనను కొంతమంది హనీట్రాప్ కు పాల్పడి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


 ఒక మహిళ తన పేరును పర్వీనా అంటూ చెప్పి సౌదీఅరేబియాలో ఉంటానని మాయ మాటలతో నమ్మించి పరిచయం పెంచుకుంది. ఇక ఓ రోజు తనకు ఒంట్లో బాగాలేదని ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేయాలని కోరింది అంటూ డాక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు కూల్ డ్రింక్ ఇచ్చారని.. ఆ తర్వాత మత్తు లోకి జారుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.  తేరుకున్న తర్వాత న్యూడ్ వీడియో లు చూపిస్తూ 50 వేలు డిమాండ్ చేశారు అంటు పోలీసులకు ఫిర్యాదులు తెలిపాడు సదరు డాక్టర్. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఇక హనీట్రాప్ కు పాల్పడిన మహిళ భోపాల్ లో ఉన్నట్లు గుర్తించి ఆమెను వలవేసి పట్టుకున్నారు. ఇక విచారణ జరుపుతూ ఆమె అసలు పేరు జోహారీ జబి అలియాస్ పర్వీనా గా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: