సాధారణంగా పోలీసులంటే ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిందని తెలిసినా నిమిషాల వ్యవధిలో అక్కడ వాలిపోతారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం ఏకంగా ఖాకీ డ్రెస్సు ఉంది అనే దర్పంతో ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా పోలీసు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.


 పంజాబ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హితీష్ కుమార్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై బయటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. అయితే అప్పుడు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇక హితేష్ కుమార్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపారు. ఈ క్రమంలోనే పత్రాలు చూపించాలని కోరారు. అతను పత్రాలు చూపిస్తూ ఉండగానే ఎస్సై వీరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు మాట్లాడాడు. ఆ తర్వాత మహిళతో వాగ్వాదానికి దిగాడు. అయితే మహిళ భయపడిపోయి తన బంధువులకు ఫోన్ చేసి తెలిపింది.


 దీంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇక పోలీసులకి బంధువులకి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే సబ్ ఇన్స్పెక్టర్ బల్విందర్ సింగ్ ఏకంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఇక తన సర్వీస్ రివాల్వర్ తీసి బంధువులపై కాల్పులు జరిపాడు. దీంతో భర్త హితేష్ కుమార్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: