బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనిషి నేటి రోజుల్లో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ఆందోళనకరంగా మారిపోతుంది అని చెప్పాలి. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు మనిషి. వెరసి వెలుగులోకి వస్తున్న ఘటనలు అందరిని ఉలికిపాటుకు గురిచేస్తు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న తగాదాలు.. ఈ తగాదాలు దారితీస్తున్న పరిణామాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. సాధారణంగా దాంపత్య బంధం లో ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే.


 నమ్మకం ఉన్నప్పుడే ఇక దాంపత్య బంధం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దాంపత్య బంధంలోకి అనుమానం పెనుభూతం దూరుతుందో ఇక ఊహకందని రీతిలో దారుణమైన ఘటనలకు దారితీస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతనికి పెళ్లయి 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్య దంపతులుగానే ఉన్నారు. కానీ అంతలో భార్యపై అనుమానం మొదలయింది. ఈ క్రమంలోనే అనుమానం పెరిగిపోయి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త.


 ఈ దారుణమైన ఘటన మైసూరులోని చట్టనాహళ్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పుట్టమ్మ అనే మహిళకు దేవరాజు కు ఇరవై ఒక్క ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్ళ కూతురు కూడా ఉంది. ఇక ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి దాంపత్య బంధం లో  అనుమానం అనే పెనుభూతం దూరింది. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త దేవరాజు. ఇక ఇటీవలే భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా తల మొండెం వేరు చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే మొదటి భార్య పై కూడా గతంలో హత్యాయత్నానికి పాల్పడి జైలుకు వెళ్ళాడు దేవరాజు. ఇప్పుడు పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: