నేటి రోజుల్లో యువత పై సినిమాల ప్రభావం ఎంతగానో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో చూసే ఎంతో మంది చిన్న వయసులోనే ప్రేమలో పడటం వంటివి కూడా జరిగిపోతున్నాయి. కానీ సినిమాలో చూపించినట్టుగా ప్రేమ రియల్ లైఫ్ లో స్వీట్ గా ఉండడం లేదు. ఒక్కసారి ప్రేమించిన తర్వాత ఎన్నో కష్టాలను చూస్తున్నారు ప్రేమికులు. చివరికి ప్రేమను గెలిపించుకోలేక ప్రేమించిన వారితో కలిసి బ్రతకలేక మనస్థాపంతో  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇటీవల కాలంలో ఇలా  చిన్న వయసులోనే ప్రేమ పుట్టడం ఇక అదే ప్రేమ పేరుతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమను గెలిపించుకోలేక పోయాము అని మనస్థాపం చెందిన ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన  విషాదకర ఘటన నబరంగపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని డబుగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సమీపంలో ఉన్న జీడీ తోటలో అదే గ్రామానికి చెందిన తీలేయ్ హరిజన్, డంబోరు హరిజన్ అనే యువతీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మీరిద్దరూ అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు.


 ఈ క్రమంలోనే ఊరికి సమీపంలో ఉన్న జీడి తోట లో ఒక చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని వేలాడుతు ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతురాలి అన్న మృతుడి అక్కడ వివాహం చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారి పోయింది. బంధువులు అయినప్పటికీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: