గురువులు అంటే ప్రత్యక్ష దైవం తో సమానం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే ఇక ఆ జీవితానికి అసలైన అర్థం చెప్పేది.. సరైన మార్గంలో నడిపించేది మాత్రం గురువులే అని చెప్పాలి. అందుకే నేటి సభ్య సమాజంలో గురువులకు ఎనలేని గౌరవం ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక తమ పిల్లలను సన్మార్గంలో నడిపిస్తారు అనే ఒక నమ్మకంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఎంతో సంతోషంగా బడికి పంపించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవల కాలంలో కొంతమంది  టీచర్లు వ్యవహరిస్తున్న తీరు మాత్రం గురువు వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది అని చెప్పాలి.


 ఎందుకంటే తమ దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన పిల్లలను సొంత బిడ్డల్లా భావించి ఎంతో ప్రేమగా అర్థమయ్యే విధంగా చదువులు చెప్పాల్సింది పోయి.. స్కూల్ కు వచ్చిన పిల్లలతో నాన్న చాకిరి చేయిస్తూన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.  ఇక ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. మా పిల్లలను ఇంట్లోనే అలాంటి పనులు చేయనివ్వం.. ఇక పాఠశాలలో ఇలాంటి పనులు చేయించడం ఏంటి అంటూ టీచర్ల తీరుపై తల్లితండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి సంచలనంగా మారిపోయింది. బడికి చదువుకోవడానికి వచ్చిన ఒక పిల్లాడితో టీచర్ ఏకంగా మసాజ్ చేయించుకుంది. హాయిగా కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతూ ఇక తన చేతులను మసాజ్ చేయించుకుంది ఆ టీచర్. ఉత్తరప్రదేశ్లోని హారడోయ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఊర్మిళ సింగ్ అనే టీచర్  విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించుకుంటూ ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోవడం తో ఉన్నతాధికారులు సదరు టీచర్ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: