మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో నేటి రోజుల్లో అదే మానవత్వం కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే రక్త సంబంధాలకు కూడా విలువ ఇవ్వకుండా ఆస్తులు అంతస్తులు విలువ ఇస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రోజురోజుకీ వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఆస్తుల కోసం రక్తసంబందాన్ని కూడా మర్చి సొంత వారిని కూడా దారుణంగా హత్య చేసిన ఘటనలూ ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 ఇలా ఇటీవలి కాలంలో ఆస్తుల కోసం ఎంతో మంది సొంత వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు కోకొల్లలు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అని చెబుతూ ఉంటారు. తమ్ముడి విషయంలో ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ సొంత అక్క తమ్ముడిని హత్య చేయించేందుకు సిద్ధమైంది. ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యశ్వంతపుర లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.


 అయితే ఆస్తుల కోసం రక్తసంబంధం మరిచిన అక్క ప్లాన్ వేసి చివరికి తమ్ముడి ఉసురు తీసేసింది. నగరంలోని ఘాజీపూర లే అవుట్ కు చెందిన నాగరాజ్ జూలై 28వ తేదీన కలబుర్గి నగరం నుండి అలంద వైపు వెళుతూ ఉన్నాడు. అయితే నాగరాజుపై ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో కేరెభూసాగా గ్రామం వద్ద శవమై తేలాడు. అయితే దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. కాగా అదే ప్రాంతానికి చెందిన అవినాష్  తానే హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే  అసలు విషయం బయటపడింది. నాగరాజ్ అక్క సునీత 50 వేలు సుపారీ ఇచ్చి తమ్ముడు ని హత్య చేయించిందని లొంగిపోయిన నిందితుడు ఒప్పుకున్నాడు. కాగా మిగతా నిందితులను కూడా అరెస్టు చేశాడు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: