బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు నేటి రోజుల్లో ఉన్మాదులు గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆస్తుల కోసం సొంత వారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. దీంతో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అనే చెప్పాలి. సాధారణంగా అన్నదమ్ములు కీడెంచితే.. బావ మాత్రం మంచి కోరతాడు అనే నానుడి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక బావా ఆస్తి విషయంలో ఏకంగా బావమరిది ని దారుణంగా హత్య చేసిన ఘటన  ఉలిక్కిపడేలా చేసింది. ఇక ఈ హత్య కేసులో విచారణ జరిపిన పోలీసులు పోలీసులు రెండున్నర నెలల తర్వాత మిస్టరీని ఛేదించారు అని చెప్పాలి.


 అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన  శారదమ్మ కు అఖిల్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.. వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కాగా పెద్దకుమార్తె వర్షిత కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. గుద్దేళ్ల గ్రామానికి చెందిన అనిల్ తో పెళ్ళి జరిపించారు. అయితే శారదమ్మ కు  13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా అల్లుడు అనిల్కు ఆ భూమి పై కన్ను పడింది. శారదమ్మ కుమారుడైన అఖిల్ను అడ్డు తొలగించుకుంటే భూమి తన సొంతమవుతుందని బావ అనిల్ ప్లాన్ వేసాడు. సెల్ఫోన్ ఇప్పిస్తానని చెప్పి బైక్పై ఎక్కించుకుని కొడవలి కర్రలతో దాడి చేసి చంపేశాడు. శరీరాన్ని వంకలో పూడ్చి పెట్టాడు.


 అయితే కుమారుడు కనిపించకపోవడంతో తల్లి శారదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్ కూడా నెల రోజులుగా కనిపించడం లేదని భావించి.. అనుమానంతో  దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఇటీవలే అనిల్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా  భూమి కోసం బావమరిదిని చంపినట్లు అంగీకరించాడు. ఇక స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లి అరణ్యరోదనగా వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: