విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే... పెద్దలు ఎప్పుడూ ఈ మాట చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తు ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసిన తరువాత మాత్రం నిజంగానే మనిషి జీవితం వింత నాటకం అని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇక పెద్దలు చెప్పిన మాట కి సరిగ్గా సరిపోయే విధంగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది.


 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒకే పాము ఇద్దరు అన్నదమ్ముల ను కూడా పగ బట్టినట్లు గానే కాటువేసింది. ఉత్తరప్రదేశ్లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాముకాటుతో చనిపోయిన సోదరుడు అంత్యక్రియలకు హాజరైన యువకుడిని అదే పాము కాటువేయగా అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. బాలరామ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అరవిందు మిశ్రా  అనే 38 ఏళ్ల వ్యక్తి పాముకాటుకు గురి అయ్యాడు.  కాగా అతని అంత్యక్రియలు నిర్వహించగా పంజాబ్లోని లూధియానాలో ఉన్న గోవిందు మిశ్రా అక్కడికి వచ్చాడు.


 అయితే అంత్య క్రియలు ముగిసిన తర్వాత గోవిందు మిశ్రా అతని బంధువు చంద్రశేఖర్ తో కలిసి ఒక గది లో నిద్రిస్తుండగా ఆ రాత్రి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము ఇద్దరిని కాటేసింది. దీంతో గోవింద మిశ్రా కాసేపటికే మృతి చెందాడు. ఇక చంద్రశేఖర్ ని ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్న అంత్య  క్రియలకు వెళ్లి తమ్ముడు కూడా పాముకాటుకు బలివ్వడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో  స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: