ఒకప్పుడు అడిగినా కానీ అప్పు ఇచ్చేవారు ఎవరు ఉండేవారు కాదు కానీ ఇటీవల కాలంలో మాత్రం టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో అప్పు ఇవ్వడం కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో వద్దు వద్దు అన్నా కూడా రుద్ది రుద్ది అప్పులు ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ సంస్థల వరకు కూడా అన్ని అడగకపోయినా అప్పు ఇస్తామంటూ తరచూ ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్. అయితే ఎవరైనా అవసరం ఉండి పొరపాటున అప్పు తీసుకున్నారంటే చాలు చివరికి వారి దగ్గర నుంచి ముక్కు పిండి మరి అప్పు వసూలు చేయడమే కాదు అప్పు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్న అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. లోన్ తీసుకున్న పాపానికి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న యువకుడు చివరికి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఈ ఘటన చెన్నైలోనే కేకే నగర్ లో వెలుగు చూస్తుంది. నరేంద్రన్ అనే 23 ఏళ్ల యువకుడు ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.  మూడు నెలల క్రితం ఏదో అవసరమై ఓ లోన్ యాప్ ద్వారా 5000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించేందుకు మరో లోన్ యాప్ నుంచి అప్పు తీసుకుని పాత లోన్ కట్టేసాడు. అయితే కొద్ది రోజులకు లోన్ యాప్స్ సిబ్బంది నరేంద్రన్ కు ఫోన్ చేసి కొత్తగా తీసుకున్న అప్పు క్లియర్ చేసేందుకు 30 వేల రూపాయలు కట్టాలంటూ చెప్పారు. లేదంటే చర్యలు తీసుకుంటామంటు హెచ్చరించారు.


 ఇక భయపడి పోయిన నరేంద్రన్ తండ్రి దగ్గర 30000 తీసుకొని అప్పు చెల్లించాలని భావించాడు. కానీ లోన్ యాప్ సిబ్బంది 50 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. ఇక వారి వేధింపులు తాళ లేకపోయినా నరేంద్రన్ మరో లోన్ యాప్ నుంచి 50,000 తీసుకొని పాత లోన్ కట్టేశాడు. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే లోన్ యాప్స్ ఇబ్బంది కాల్ చేసి వేధింపులకు గురి చేయడం చేశారు. 80,000 కట్టాలి అంటూ డిమాండ్ చేశారు. లేదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించారు. దీంతో తీవ్రవత్తిడికి గురైన నరేంద్రన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: