ఇటీవల కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా వీధి కుక్కలు అంటే ఇక గ్రామ సింహం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత కూడా వీధి కుక్కలు మాత్రం అటు గ్రామానికి కాపలా కాస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో వీధి కుక్కలు గ్రామానికి కాపలా కాయడం ఏమో కానీ మనుషుల ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి  ఏకంగా వీధి కుక్కలు గుంపుగా ఏర్పడి దారుణంగా మనుషులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 దీంతో నేటి రోజుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న తీరు చూసి అటు జంతు ప్రేమికులు సైతం ఎక్కడైనా కుక్కను చూస్తే చాలు  హడలిపోతున్నారు అని చెప్పాలి. ఇటీవలే వీధి కుక్కలు సృష్టించిన వీరంగానికి ఏకంగా లక్షల నష్టం వాటిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుక్కలు చేసిన పనికి ఏకంగా 150 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం సమీపంలో వెలుగులోకి వచ్చింది. రాజోలి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి వద్ద గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ ఉన్నాడు.


 ఇంతలో అటువైపుగా కుక్కల గుంపు వచ్చింది. అయితే ఇలా అక్కడికి వచ్చిన కుక్కల గుంపు అక్కడ మేస్తున్న గొర్రెలను తరమడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా భయపడిపోయిన గొర్రెలు రైలు పట్టాలపై పరిగెత్తాయి. ఇక అదే సమయంలో రైలు వేగంగా దూసుకు రావడంతో చివరికి రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి   మరో 50 గొర్రెలు గాయపడ్డాయి అన్నది తెలుస్తుంది. అయితే మొత్తం 25 లక్షలు నష్టం వాటిలిందని గొర్రెల యజమానులు బోరును విలపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి అంటూ విన్నపిస్తున్నారు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: