ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అయితే గతంలో ఇలాంటి వాటి గురించి పెద్దగా తెలిసేది కాదు. కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయింది. దీంతో ఎక్కడ ఏదైనా వింతైన ఘటన జరిగింది అంటే చాలు దాని గురించి ఇక అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ఏ విషయమైనా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఇట్టే వాలిపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని వింతైన ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలాంటి ఆచారాలలో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. ఏకంగా ఒక గ్రామంలో  ఐదు రోజులపాటు ఆ గ్రామంలోని మహిళలు ఎవరు కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారట. ఈ ఆచారం వినడానికి కాస్త ఎబ్బెట్టుగా  ఉంది కదా. అయితే ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే ఉందట. ఇటీవల ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు హిమాలయాలకు దగ్గరలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఈ ఆచారం ఉందట. రాష్ట్రంలోని కులు జిల్లాలో పిని అనే ఒక గ్రామం ఉంది.


 ఆ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారట. వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని వాళ్లు పాటిస్తూ ఉన్నారట. పైగా ఇది వారి తరతరాల ఆచారమని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇలా నగ్నంగా ఉంటే ప్రకృతికి గౌరవం ఇచ్చినట్లు వారు భావిస్తారట. అంతేకాదు ఆరాధ్య దైవానికి నగ్నంగానే పూజలు చేస్తారట. ఇలా నగ్నంగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలిని, పరిశుద్ధమైన సూర్యకాంతిని, సహజ వాతావరణాన్ని ఆలింగనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అక్కడ ప్రజలు నమ్ముతారట. ఇలా చేయడం వల్ల ఎలాంటి వ్యాధులు రుగ్మతలు కూడా దరి చేరవనీ విశ్వసిస్తారట. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: