భార్యాభర్తల బంధంలో అన్యోన్యత అనేది ఎంతో ముఖ్యం. కష్టసుఖాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తోడునీడుగా ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. అదే సమయంలో ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం చివరి వరకు కొనసాగుతుంది. ఇంటికి పునాది బలంగా ఉండడం ఎంత ముఖ్యమో.. భార్యాభర్తల మధ్య అటు నమ్మకం ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇక వారి బంధం మధ్య అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే ఎన్నో అనర్థాలకు కూడా కారణం అవుతూ ఉంటుంది.


 ఏకంగా కొన్ని కొన్ని సార్లు ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చే పరిస్థితులు కూడా తీసుకువస్తూ ఉంటుంది అనుమానం. అయితే కేవలం భార్యాభర్తల బంధం లోనే కాదు ఏ బంధంలో అయినా ఇలా అనుమానం దారుణాలకు కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటి అనుమానమే ఇటీవల ఒక ప్రాణం పోవడానికి కారణం అయ్యింది. ఏకంగా తాళి కట్టి కడవరకు తోడుంటానని ప్రమాణం చేసిన భర్త.. చివరికి భార్యను దారుణంగా కడ తేర్చాడు. హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


 కర్ణాటక కు చెందిన విజయలక్ష్మి అనే 32 ఏళ్ల వివాహిత చందానగర్ పరిధిలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో వివాహం ఉంటుంది. అయితే అక్కడ వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది విజయలక్ష్మి. అయితే ఆమెకు భరత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కాగా ఇటీవల  భరత్ అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఆమెను చాకుతో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోయాడు. తాను ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ ఫోన్ బిజీ వస్తుందని.. అందుకే తాను వేరొకరితో సంబంధం పెట్టుకుంది అనే అనుమానం పెంచుకొని దారుణంగా హత్య చేసినట్లు సదరు యువకుడు పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: