నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మంచివాళ్లం అనే ముసుగు వేసుకుంటున్న ఎంతోమంది మనుషులు సమయం సందర్భం చూసి తమలోని నీచమైన ఆలోచనను బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎదుటి వారికి ఇబ్బందులకు గురి చేయడం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు ఇలా మంచి వాళ్ళ ముసుగు వేసుకుంటున్న నీచుల బారిన పడి మోసపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషులు ఏకంగా అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే దారుణంగా మారిపోయారు అనే భావన ప్రతి ఒక్కరులో కూడా కలుగుతూ ఉంది  ఎందుకంటే మహిళల విషయంలో ఎంతో దారుణంగా ఆలోచిస్తూ వేధింపులకు పాల్పడుతున్న మనుషులే.. నేటి సభ్య సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇలాంటి తరహా ఘటనలతో ఇక ప్రతి ఒక్కరితో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో వచ్చింది. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక దారుణ ఘటన జరిగింది. స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఒక వ్యక్తి వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.


 హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఇలా యువతి స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గాంధీనగర్ లంక లైన్ లో నివాసం ఉంటున్న 25 ఏళ్ళ యువతీ.. తన ఇంట్లో బాత్రూంలో స్నానం చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన జెల్ ఫేస్ అనే 24 ఏళ్ల యువకుడు దొంగచాటుగా వీడియో తీస్తుండగా.. యువతి గమనించి పెద్దగా కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక వెంటనే ఆ సదరు బాధిత యువతీ పోలీసులను ఆశ్రయించగా.. ఇక అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: