మూగజీవాలుగా, సాదు జంతువులు గా ఉండే కొన్ని జీవులు కొన్ని కొన్ని సార్లు ఆగ్రహం వచ్చినప్పుడు ఏకంగా సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. ఇలాంటి వాటిలో సాదు జంతువులైన ఆవులు, ఎద్దులు లాంటివి కూడా ఉంటాయి. వాటికి కోపం వచ్చినప్పుడు ఏకంగా మనుషులపై దారుణంగా దాడి చేయడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అచ్చం ఇలాగే ఏనుగులు కూడా ఏకంగా బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి అని చెప్పాలి. మావటివాడు ఒక చిన్న కర్రతో భారీ ఏనుగును కంట్రోల్ చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసాము. మావటి ఏం చెప్పినా ఏనుగు తూచా తప్పకుండా వింటూ ఉంటుంది.


 కానీ అదే ఏనుగుకు కోపం వస్తే మాత్రం అది సృష్టించే బీభత్సం కలలో కూడా ఊహించనంత భయంకరంగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా మావటి పైనే ఏనుగులు దాడి చేయడం లాంటి ఘటనలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇటీవల  ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా ఏనుగుని మందలిస్తున్న మావటిపై ఒక ఏనుగు దారుణంగా దాడి చేసింది. ఏకంగా అతని ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే తీసేసింది. ఈ ఘటన కేరళలోని అడిమాలిలో వెలుగులోకి వచ్చింది. కల్లారు ప్రాంతంలో చోటుచేసుకుంది. టూరిస్టులను సఫారీ కి తీసుకువెళ్లేందుకు ఈ ప్రాంతంలో చాలా ఏనుగులను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణన్ అనే 60 ఏళ్ల మావటి ఓ ఏనుగు వద్దకు వెళ్లి నిలబడేలా శిక్షణ ఇస్తున్నాడు. చేతిలోని కర్రతో ఏనుగు కాళ్లపై సున్నితంగా కొడుతూ ఏనుగు సరిగ్గా నిలబడేలా సూచనలు చేస్తున్నాడు.


 ఇలాంటి సమయంలో ఏనుగు కోపం కట్టలు తెంచుకుంది  ఏకంగా మామిడిపై దాడికి దిగింది  ఏకంగా ఆ భారీ ఏనుగు అతనిపై కాళ్లు మోపి బలంగా తొక్కింది. అంతటితో ఆగకుండా అతని వీపుపై కాళ్లు మోపి తొక్కడంతో మావటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  ఏనుగు దాడి చేయడాన్ని గమనించిన ఇంకో వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు  అయితే అప్పటికే బాలకృష్ణన్ మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది.  అటవీ శాఖ అధికారులు దీనిపై స్పందించారు. ఏనుగులను సఫారీకి అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో సదరు సఫారీ కేంద్రాన్ని మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏనుగు దారుణంగా దాడి చేసిన వీడియో చూసి నేటిజన్స్  అందరూ కూడా షాక్ అవుతూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: