డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఏకంగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటే.. ఇంకొంతమంది వ్యాపారం చేసి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మరింత లాభాలను గడిస్తూ ఉంటారు. రోజువారి కూలి చేసుకుని బ్రతుకుని వెలదీస్తే సామాన్య కూలీలకు కూడా అటు డబ్బు సంపాదించాలి.. ఉన్నత స్థానంలోకి ఎదగాలి అనే కోరిక ఉన్న.. అది వారితో సాధ్యం కాదు అని సర్దుకుపోతూ ఉంటారు.


 కానీ ఇలాంటి వారికి కొన్ని కొన్ని సార్లు ఊహించనీ రీతిలో అదృష్టం వరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. వారిని అదృష్ట లక్ష్మి కరుణిస్తూ ఉంటుంది. చివరికి ఇలా పేదరికంలో ఉన్నవారు ఏకంగా ఒక రాత్రిలోనే కోటీశ్వరుడు గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక స్టోరీ గురించే. మధ్యప్రదేశ్లో ఒక పేద కూలికి అదృష్టం వరించింది. అతను రోజుకు 300 రూపాయలకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు. రిక్కాడితే గాని డొక్కాడని  కుటుంబం. పనిచేస్తేనే కడుపునిండేది. కాగా అతనికి విలువైన వజ్రం దొరికింది. ఇక వీరికి దొరికిన వజ్రం 19.2 క్యారెట్ల స్వచ్ఛమైనది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ వజ్రానికి వేలం నిర్వహించగా 50 లక్షలు పలికింది. దీంతో రాజు కష్టానికి ఫలితం దక్కింది. కాగా మధ్యప్రదేశ్లో ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది కొంత డబ్బు చెల్లించి ఈ వజ్రాలను వెతకొచ్చు. ఇలా కొంత డబ్బు చెల్లించి వజ్రం వెతకడం ప్రారంభించిన రాజుకి అదృష్టం వరించి చివరికి లక్షాధికారిగా  మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: