నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా.. మూడ్ ఎలా ఉన్నా కూడా అరచేతిలో మాత్రం మొబైల్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయినట్లుగా అందరూ దిగాలిగా ఉండిపోతారు. అంతలా మొబైల్ నేటి రోజుల్లో మనుషులను బానిసలుగా మార్చేసుకుంది. నేటి రోజుల్లో అందుబాటులోకి వస్తున్న అధునాతన  టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లు మనిషికి సంబంధించిన అన్ని అవసరాలను తీర్చేస్తూ ఉన్నాయి. దీంతో బయట ప్రపంచంతో అవసరమే లేకుండా పోయింది.



 అయితే ఇలా నేటి రోజుల్లో మొబైల్ వాడుతున్న ప్రతి మనిషి కూడా టెక్నాలజీకి కూడా బాగా అలవాటు పడిపోయాడు అని చెప్పాలి. ఒకప్పటిలా ఏదైనా కావాలి అంటే బయటికి వెళ్లి తెచ్చుకోవట్లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు కావాల్సినవన్నీ కూడా ఇంటి ముందుకే వచ్చి.. డెలివరీ చేస్తూ ఉన్న సర్వీస్ లు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. దీంతో ఇలాంటి సర్వీస్ లకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి కావాల్సినవన్నీ కూడా మొబైల్ లోనే ఆర్డర్ పెట్టుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా టెక్నాలజీ మీద కాస్త అతిగా ఆధారపడటం కొన్ని కొన్ని సార్లు జనాలకు చేదు అనుభవాలనే మిగులుస్తూ ఉంది. ఎందుకంటే ఏదో బుక్ చేస్తే ఇంకేదో డెలివరీ అవ్వడం జరుగుతూ వస్తుంది.


 ఇక ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్స్ కు ఉన్న యాపిల్ ఫోన్ అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక వ్యక్తి స్పెషల్ ఆఫర్లో 12,000లకు యాపిల్ ఫోన్ అనే యాడ్ చూసి వెంటనే బుక్ చేసాడు  ఇక ఇంటికి వచ్చిన డెలివరీ చూసి మాత్రం కంగుతిన్నాడు. ఎందుకంటే యాపిల్ ఫోన్ బుక్ చేస్తే ఏకంగా యాపిల్ పండ్లు డెలివరీ అయ్యాయి  తాడేపల్లి గూడానికి చెందిన యువకుడికి ఫేస్బుక్లో ఈ ఆఫర్ కనిపించింది  క్యాష్ అండ్ డెలివరీ ఉండడంతో బుక్ చేశాడు. ఇంటికి కొరియర్ రాగానే 12000 చెల్లించి తీసుకున్నాడు. ఓపెన్ చేస్తే యాపిల్స్ కనిపించాయ్. దీంతో వెంటనే రిటర్న్ పెడదామని అనుకున్న.. ఆ యాప్ లో రిటర్న్ ఆప్షన్ లేకపోవడం ఇక అంతేకాదు యాడ్లో ఉన్న నెంబర్ పనిచేయకపోవడంతో ఏం చేయాలో పాలకోక అతను పోలీసులను ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: