విష‌యం ఏదైనా విషం చిమ్మ‌డం అల‌వాటైన ప్ర‌తిప‌క్షాలకు... పేద‌ల క‌న్నీళ్లు తుడిచేందుకు, వారికి నిక రం గా ఓ గూడు ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జ‌గ‌న్ ఉదార స్వ‌భావం కూడా ఎబ్బెట్టుగానే ఉంది. ఏదో ఒక వంక‌తో ఈ ప‌థ‌కాన్ని కూడా అడ్డుకునేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భు త్వం ప్ర తిష్టాత్మ‌కంగా ఆచ‌ర‌ణ‌లో పెడుతున్న మేనిఫెస్టోలో కీల‌క‌మైన ప‌థ‌కం.. దాదా పు 30 ల‌క్ష‌ల మంది కి ప్ర‌యోజ ‌నం చేకూర్చే ప‌థ‌కం.. `న‌వ‌ర‌త్నాలు-పేద‌ల‌కు ఇళ్లు` ప‌థ‌కం. రాష్ట్రంలోని అ ర్హులైన పేద‌ల‌కు గూడును ఏ ర్పాటు చేయాల‌నే ఉన్న‌త సంక‌ల్పంతో చేప‌ట్టిన ఈ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో ఎన్నో ఆశ‌లు ఉన్నా యి. అదేస‌మ యంలో వైసీపీ నేత‌లు స‌హా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా చాలానే ఆశ‌లు పెట్టు కున్నారు. 

 

వాస్త‌వానికి ఈ ప‌థ‌కాన్ని ఈ ఏడాది ఉగాది పండుగ నాటికి పూర్తిగా అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించా రు. ఈ క్ర‌మంలోనే అర్హుల ఎంపిక‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేశారు.  ఈ క్ర‌మంలోనే పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల‌ను వారు అవ‌స‌ర‌మైన ప‌క్షంలో విక్ర‌యించుకునేందుకు వీలుగా కూడా అవ‌కాశం క‌ల్పించారు. నిజాని కి ఇది పేద‌ల‌కు ఎంతో ఉప‌క‌రిస్తుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో చేతిలో ఉన్న ఇల్లు వారికి కొండంత అండ ‌గా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సీఎం జ‌గ‌న్ పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల‌ను `ఎప్పుడైనా విక్ర‌యించు`కునేలా వెసు లుబాటు క‌ల్పించారు. అయితే, ప్ర‌తిప‌క్షాలు ఈ ప‌థ‌కానికి మోకాల‌డ్డాయి. దీనిని ఓటు బ్యాంకు రాజ‌కీయ కోణంలోనే చూశాయి. ఈ ప‌థ‌కం క‌నుక అమ‌లైతే.. జ‌గ‌న్‌కు చిర‌కాల ప్రాధాన్యం పెరిగి.. ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఆయ‌న‌కు స్థానం ఏర్ప‌డుతుందని భావించాయి. 


ఈ నేప‌థ్యంలోనే పేద‌ల ఇళ్ల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ్డాయి. వీటిని నిలుపుద‌ల చేయించేలా ప్ర‌య‌త్నాలు సాగాయి. ఈ క్ర‌మంలో కోర్టు స‌ద‌రు ఇళ్ల‌ను క‌నీసం ఐదేళ్ల వ‌ర‌కు విక్ర‌యించే అవ‌కాశం లేకుండా చూడాల ‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇళ్ల ప‌థ‌కంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదిలావుంటే, క‌రోనా నేప‌థ్యంలో ఇళ్ల పంపిణీ వ్య‌వ‌హారానికి సంబంధించిన షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి న ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది. దీంతో జూలై 8న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆ రో జున రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ఇళ్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఇప్పుడు కోర్టుల ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో దీనిని అడ్డుకునే అవ‌కాశం లేదు. జూలై 8న ఈ కార్య‌క్ర‌మం అమ‌లు జ‌రుగుతుంది. 


మ‌రి ఈ కార్య‌క్ర‌మం ఇంత సాఫీగా సాగిపోయే అవ‌కాశం ఉండి ఉంటే.. దీనిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకునే అవ‌కాశం ఉండేది కాదు. కానీ, ఈ ప‌థ‌కం అమ‌లు కాకుండా మ‌ళ్లీ మ‌ళ్లీ వాయిదా వేయించాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాలు.. తాజాగా పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల‌కు సంబంధించిన భూ సేక‌ర‌ణ‌ను రాజ‌కీయం చేయ‌డం ప్రారంభించాయి. పేద‌ల కోసం సేక‌రించే భూముల‌పై వంక‌లు పెట్ట‌డం, వివాదాస్ప‌దం చేయ‌డం వంటివి తాజాగా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప‌థ‌కం కోసం.. తుప్ప‌లు తొక్కేస్తున్నా ర‌ని, ప‌చ్చ‌టి పంట పొలాల‌ను లాగేసుకుంటున్నార‌ని, అసైన్డ్ భూముల‌ను కూడా తీసుకుంటున్నార‌ని  పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తూ.. త‌మ అనుకూల మీడియాల్లో క‌థ‌నాలు రాయించుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు.. మొత్తంగా ఈ ప‌థ‌కంపై ప‌క‌డ్బందీ వ్యూహంతో విషం చిమ్ముతున్నారు. 

 

ఈ రాత‌ల్లో మ‌రో విశ్లేష‌ణ‌ను కూడా జొప్పించారు. న‌గ‌రాలు, ప్రాంతాల‌కు సుదూరంలో పేద‌ల‌కు ఇళ్లు ఇ స్తున్నార‌ని, అక్క‌డ తాగేందుకు చుక్క‌నీరు కూడా లేద‌ని, ఎలాంటి మౌలిక స‌దుపాయాలు లేని చోట ఇళ్లు ఇచ్చి ఏం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను త‌మ అనుకూల మీడియాల్లో హైలెట్ చేసిన ‌ప్పుడు.. నిర‌క్ష‌రాస్యులైన పేద‌లు.. నిజ‌మే క‌దా.. అనుకుంటారు. త‌మ‌ను ప్ర‌భుత్వం ఏదో అన్యాయం చేస్తోంది క‌దా? అనుకుంటారు. కానీ, వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికీ సొంతగా భూములు అంటూ ఉండ‌దు.  ఉన్నా.. వాణిజ్య అవ‌స‌రాల‌కు కేటాయించాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. దీంతో ప్రైవేటు భూముల‌ను కొనుగోలు చేయ‌క‌త‌ప్ప‌దు. మ‌రీ ముఖ్యంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో పేద కుటుంబాల‌కు పంపిణీ చేస్తున్న‌ప్పుడు కొద్ది పాటి భూములు అస్స‌లు స‌రిపోవు. 


ఈ నేప‌థ్యంలో ప్రైవేటు భూములు, రైతుల పొలాల‌ను కూడా కొనుగోలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ విష‌యం తెలిసి కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని ముందుకు సాగుతోంద‌నే అభిప్రాయం ఉంది. ఇక‌, న‌గ‌రాల‌కు, ప‌ట్ట‌ణాల‌కు సుదూరంగా ఇస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి అక్క‌డే క‌దా ఖాళీ స్థ‌లాలు ఉండేది. ఈ విష‌యం కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క‌నీసం సౌక‌ర్యా లు కూడా లేవు.. అనే మ‌రో విమ‌ర్శ కూడా ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తోంది. ఔను. నిజ‌మే. కానీ, ఎక్క‌డైనా.. ఏ ప్ర‌భుత్వాలైనా.. ముందు స్థ‌లాలు ఇచ్చి.. త‌ర్వాత మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటుచేస్తాయి. ఈ విష‌యం కూడా మాజీ సీఎం చంద్ర‌బాబుకు తెలియ‌ని విష‌యం అనుకోలేం. కానీ,  ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌భుత్వానికి ఏదో విధంగా మ‌కిలి అంటించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ఆయ‌న కొంద‌రిని పోగేస్తున్న విమ‌ర్శ‌లు న‌వ్వుల పాల‌వుతున్నాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: