జ‌గ‌న్ కేబినెట్‌లో రెండు బెర్త్‌లు ఖాళీ అవుతున్నాయి.  దీంతో ఈ రెండు బెర్తుల్లో ఒక‌టైనా త‌మ జిల్లాకు చెందిన రెడ్డి నాయ‌కుడు, జ‌గ‌న్ దృష్టిలో క్లీన్ అండ్ సేఫ్‌గా గుర్తింపు పొందిన నేత‌కు ద‌క్కుతుంద‌ని నెల్లూ రు జిల్లా వైసీపీ నేత‌లు.. గుస‌గుస‌లాడుకుంటున్నారు. చెవిలో చిన్న‌మాట అంటూ.. ఈ విష‌యంపై పెద్ద‌గా నే చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, సుభాష్ చంద్ర‌బోస్ పిల్లి.. ఇద్ద‌రూ కూడా రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ అయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అదేస‌మయంలో  ‌మ‌రో ఇద్ద‌రిని ప‌క్క‌కు త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. 


ఈ నేప‌థ్యంలో మొ త్తంగా నాలుగు నుంచి ఐదు  కేబినెట్ బెర్త్‌లు ఖాళీ అవుతాయ‌ని.. వైసీపీ నేత‌లు అనుకుంటున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన‌ప్ప‌టికీ.. మోపిదేవి, బోసు ఇద్ద‌రూ కూడా మంత్రి ప‌ద‌వులకు రాజీనామా చే య‌లేదు. అయితే, ఒక‌టి రెండు రోజుల్లోనే వీరు నిబంధ‌న‌ల మేర‌కు రాజీనామా స‌మ‌ర్పించి.. రాజ్య‌స‌భ స భ్యులుగా ప్ర‌మాణం చేయాల్సి ఉంటుంది. దీంతో మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు కీల‌క నాయకు లు త‌మ త‌మ ప్ర‌యత్నాలు అప్పుడే ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంద‌రు నాయ‌కులు.. ఒక్క ఛాన్స్ కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నార‌ని.. వైసీపీలో కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు. 


ఇదిలా వుంటే.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ..  నెల్లూరులో అయితే.. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి కీల‌క నాయ‌కుల వ‌ర‌కు కూడా ఫోన్ల‌పై ఫోన్లు చేసుకుని.. `మా రెడ్డిగారికి కేబినెట్ బెర్త్ క‌న్ఫ‌ర్మేనా?`` అని వాక‌బు చేస్తున్నారు.  అయితే, ఈ వాక‌బు అంతా కూడా అత్యంత ర‌హ‌స్యంగానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.  నెల్లూరు నుంచి మంత్రి ప‌ద‌వుల రేసులో న‌లుగురు రెడ్డి నేత‌లు కీల‌కంగా ఉన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి,  నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిలు కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు. 


వీరిలో జ‌గ‌న్‌కు ఆప్తులైన వారు కొంద‌రు ఉంటే.. రాజ‌కీయంగా సీనియ‌ర్ అయిన వారు కొంద‌రు ఉన్నారు. ఇక, గతంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన వారు ఒక‌రున్నారు. దీంతో వీరంతా కూడా మంత్రి పీఠం కోసం ఎదు రు చూస్తు న్నారు. పార్టీలో ఆ విర్భావం నుంచి ఉన్న నాయ‌కుల్లో కాకాని, కోటంరెడ్డి ప్ర‌ధానంగా జ‌గ‌న్ ‌కు అత్యంత విశ్వాస‌పాత్రులు. ఇక‌, ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి కూడా జ‌గ‌న్‌కు స‌న్నిహితుడే. ఆనం గ‌తంలో వైఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పారు. దీంతో వీరంతా కూడా ఇప్పుడు కేబినెట్‌లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా రు. ఈ నేప‌థ్యంలో ఈ న‌లుగురు కూడా ఎవ‌రికి వారు త‌మ‌కంటే.. త‌మ‌కు ఈ ద‌ఫా మంత్రి పీఠం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. 


స్థానికంగా సోష‌ల్ మీడియాకు లీకులు ఇస్తూ.. వారికి అనుకూలంగా జ‌గ‌న్ ఉన్నార‌నే ప్ర‌చారం చేయించు కుంటున్నారు. అదేస‌మ‌యంలో త‌మ‌కు ఎందుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలో కొన్ని ఈక్వేష‌న్ల‌ను కూడా ప్ర చారం చేసుకుంటున్నారు. దీంతో.. నెల్లూరులో మా రెడ్డి గారికి బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిందా.. అంటే.. మా రెడ్డి గారికి బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిందా.. అంటూ.. చెవిలో చిన్న‌మాటగా వైసీపీ నేత‌లు  చెవులు చిల్లులు ప‌డేలా చ ర్చించుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఒక‌రికి తెలియ‌కుండానే ఒక‌రు ఫోన్లు చేసుకో వ‌డం, ప్ర‌చారం చేసుకోవ‌డం వంటివి జోరుగా సాగుతున్నాయి. `` అన్నా మా రెడ్డిగారికి గ్యారెంటీ అన్నా రంట‌గా!`` అని ఒక‌రు అంటుంటే.. ``లేద‌హె..! ఈ సారి మా రెడ్డిగారికే ఖాయ‌మైంది‌`` అంటూ.. చ‌ర్చించు కుంటున్నారు. 


ఇక‌, జిల్లా విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఒక బీసీ, ఒక రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు జ‌గ‌న్ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌, ఆత్మ‌కూరు ఎమ్మెల్యే మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డిలు జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. దీనిని బ‌ట్టి మ‌ళ్లీ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తారా?  ప్ర‌స్తుతం ఖాళీ అయిన రెండు మంత్రి సీట్లు కూడా బీసీల‌కు చెందిన‌వే క‌దా?  అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వీటిపై త‌ట‌స్థంగా ఉండే పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. మంత్రి ప‌ద‌వుల పై మాత్రం చెవిలో చిన్న‌గా అంటూనే విష‌యాన్ని బాగానే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: