రాజ‌కీయాల‌కు-మీడియాకు ఉన్న అనుబంధం అంతా కాదు. రాజ‌కీయ నేత‌లే ప‌త్రికాధిప‌తులుగా చ‌క్రం తిప్పుతున్న రోజులు ఇవి! కాబ‌ట్టి త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న పార్టీ అధికారంలోకి వ‌స్తే.. స‌హించ‌లేక పోతు న్నారు. ఇక‌, రాజ‌కీయాల‌కు మేం దూరం.. మాకు అంద‌రూ స‌మాన‌మే.. మేం ప్రజాప‌క్షం.. అని పెన్ను విది లించే కొన్ని ప‌త్రిక‌లు.. కూడా ఊస‌ర‌విల్లుల రాజ‌కీయాలు చేస్తున్న ప‌రిస్థితికూడా మ‌న‌కు క‌నిపిస్తోంది. మంచిదే! ఇది ప్ర‌జాస్వామ్య దేశం కాబ‌ట్టి.. ఉత్త‌ర‌కొరియా మాదిరిగా ఉత్త‌ర కుమార ఆదేశాలు ఇక్క‌డ చెల్లు బాటు కావు కాబ‌ట్టి.. ఎవ‌రికి వారు వారికి న‌చ్చిన విధంగా ఉండే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. ప‌త్రిక‌ల‌ను, వాటి అధిప‌తులను కూడా ఈ రాట‌నే క‌ట్టేసుకోవ‌చ్చు. 


అయితే, అంతో ఇంతో ప్ర‌జ‌ల సొమ్ము తింటున్నారు క‌దా ప‌త్రికాధిప‌తులు. మ‌రి కొంతైనా.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాల్సిన అవ‌స‌రం లేదంటారా? అంటున్నారు.. వ‌ల్ల‌కాట్లో రామ‌నాథాలు!  ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క డ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటుచేయ‌డం.. ప్ర‌జ‌లు ఆయ‌న‌కు జై కొట్ట‌డం వంటివాటిని ఓ వ‌ర్గం మీడియా అస్స‌లు ఇప్ప‌టికీ(ఏడాది గ‌డిచిపోయిన త‌ర్వాత కూడా)  జీర్ణించుకోలేక పోతోంది. ఈ నేప‌థ్యంలో మొన్నామ‌ధ్య రాష్ట్రంలో చేస్తున్న విమ‌ర్శ‌లు చాల‌వ‌న్న‌ట్టుగా.. జాతీయ స్థాయిలో కొన్ని పత్రిక‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అచ్చోసిన పెయిడ్‌(వైసీపీ నేత‌లు ఇలానే అన్నారు సుమా!) ఆర్టిక‌ల్స్‌ను కూడా గుదిగుచ్చి.. తెలుగుమీడియాలోని ఓ వ‌ర్గం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. 


రివ‌ర్స్ టెండ‌ర్లు, పీపీఏల ర‌ద్దు, పోల‌వ‌రంలో అవినీతి, చంద్ర‌బాబు పాల‌న‌పై సీబీఐ వేయ‌డం వంటివాటి ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతూ.. జాతీయ మీడియా తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టింద‌ని, ఎడిటోరియ‌ల్స్ కూడా రాసింద‌ని తెలుగు మీడియా ప్ర‌చురించి.. పైశాచిక ఆనందం పొందింది!  గ‌తంలో మీడియాలు ఈ పం థాను అనుస‌రించిన దాఖలాలు మ‌న‌కు క‌నిపించ‌వు. ఒక ప‌త్రిక రాసిన క‌థ‌నాల‌ను.. మ‌రో ప‌త్రిక య‌థా త‌థంగా ముద్రించిన సంస్కృతి కూడా లేదు. నిజానికి ప‌త్రికాధిపతులు ఒత్తిడి చేసి మ‌రీ తెచ్చుకున్న ప్రింటింగ్ చ‌ట్టానికి కూడా ఇది వ్య‌తిరేకం. అయినా కూడా `ప‌రోప‌దేశ వేళాయాం.. వ్యాసం, ప‌రాశ‌రః`-అన్న ట్టుగా.. ఇత‌రుల‌కు నీతులు చెప్పే ట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాసుడు, ప‌రాశ‌ర మ‌హ‌ర్షి అయిపోతార‌నే సూక్తిని నిజం చేశారు అధిప‌తులు!


పోనీ.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడ‌దాం. ``మేమే కాదు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని జాతీయ మీడియా కూడా దుమ్మె త్తి పోసింది. అలాంటిది మ‌మ్మ‌ల్నే ఎందుకు మీరు త‌ప్పుప‌డ‌తారు?`` అని స‌మ‌ర్ధించుకునే క్ర‌మంలో ఈ మీడియా ఇలా వ్య‌వ‌హ‌రించింద‌ని అనుకుందాం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే జాతీయ‌ మీడియా.. అనేక విష ‌యాల్లో జ‌గ‌న్‌ను ప్ర‌శంసిస్తోంది. ఏడాది పాల‌న‌లో ఆయ‌న చేసిన మంచి ప‌నులు ఉటంకిస్తూ.. ఎడిటోరియ ‌ళ్లు, క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. మ‌రీముఖ్యంగా కోరానా టెస్టుల‌ను వేగంగా చేయ‌డంలోను, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ ‌న క‌ల్పించ‌డంలోను, ప్ర‌జారోగ్యానికి సంబంధించిన ఆరోగ్య శ్రీని మ‌ళ్లీ ప‌రుగులు పెట్టించ‌డం స‌హా 104, 108 వాహ‌నాలను వ్య‌యాన్ని ప‌క్క‌న పెట్టిమ‌రీ.. ఆధునికీక‌రించ‌డం.. చైనా విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మ‌ద్ద‌తుగా నిలిచిన తీరు విష‌యంలోను జ‌గ‌న్‌పై జాతీయ మీడియా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. 

 

ఇక‌, జాతీయ స్థాయిలో ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై `సీ-ఓట‌రు` అనే అత్యంత విశ్వ‌స‌నీయ సంస్థ నిర్వ ‌హించిన స‌ర్వేలో యువ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌కు నాలుగో స్థానం ద‌క్కింది. అంతేకాదు, గుజ‌రాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఏపీలో క‌రోనాను ఎదుర్కొంటున్న తీరుపై అధ్య‌య‌నం చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయ‌ని జాతీయ మీడియా  కొనియాడింది. ఏడిటోరియ‌ల్స్ కూడా రాసింది. మ‌రి గ‌తంలో విమ‌ర్శ‌లే క‌నిపించిన తెలుగు మీడియాలో జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కు ఇప్పుడు సానుకూల క‌థ‌నాలు, జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వ్యాఖ్య‌లు క‌నిపించ‌డం లేదా?  లేక‌.. ముక్కుకు క‌ట్టుకోవాల్సిన మాస్కుల‌ను మొహం మొత్తానికి క‌ట్టేసుకున్నారా? ! అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా అస‌లు విష‌యం తెలుసుకుంటారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: