``ఆ పార్టీ కి, మ‌న పార్టీకి తేడా లేద‌బ్బా!  రెండూ దొందే నంటావా?``- అంటూ వైసీపీలో కీల‌క నాయ‌కులు మ ‌ళ్లీ చెవులు కొరుక్కుంటున్నారు. ఫోన్ల‌కు ప‌నిచెబుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రెండు కీల‌క మంత్రి ప‌ద ‌వులు ఖాళీ అయ్యాయి. అదేస‌మ‌యంలో రెండు మండ‌లి స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. అంటే మొ త్తంగా న లుగురు వైసీపీ నాయ‌కుల‌కు అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ ఉంది. అంటే.. ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్యే లు, లేదా ఎ మ్మెల్సీల్లో.. ఇద్దరిని మంత్రులుగా తీసుకుంటే.. మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌ను మండ‌లికి పంపించే అవ‌కాశం ఉంటుంది. అంటే ఇప్ప‌టికిప్పుడు జ‌రిగే ప‌ద‌వుల‌ మార్పుల్లో మొత్తంగా న‌లుగురిని ప్ర‌మోట్ చేసేందుకు వైసీపీ అధినేత‌కు ఛాన్స్ ఉంది. 

 

మ‌రి ఈ న‌లుగురి ఎంపిక ఎలా ఉండ‌నుంది? ఎవ‌రిని ఎంపిక చేస్తారు?  కొత్త‌గా ఎవ‌రినైనా ఇద్ద‌రిని ఎమ్మె ల్సీలుగా తీసుకుని, వారినే మంత్రులుగా ప్ర‌మోట్ చేస్తారా? అంటే మొత్తంగా మార్పులను ఇద్ద‌రితోనే స ‌రిపెడ‌తారా?  లేక పైన చెప్పుకొన్న‌ట్టుగా న‌లుగురు వ‌ర‌కు అవ‌కాశం ఇస్తారా? ఇప్పుడు ఇదే విష‌యం చ‌ర్చ ‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేరకు న‌లుగురు వ‌ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని నాయ కులు భావిస్తున్నారు. తాజాగా ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లుకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, అదేస‌మ‌యంలో ఎమ్మెల్సీగా విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్‌ను ప్ర‌మోట్ చేస్తార‌ని అంటున్నా రు. లేదంటే.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మ‌రో వ్య‌క్తి, కొత్త‌గా వైసీపీలో చేరిన నాయ‌కుడికి అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. 

 

దీంతో వైసీపీలో సీనియ‌ర్లు.. ఇదే క‌నుక నిజ‌మై.. ఇప్పుడు కూడా పార్టీలో సీనియ‌ర్ల‌కు ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే.. ఇబ్బందులేన‌ని చెవిలో చిన్న‌మాట‌గా చెప్పుకొంటున్నారు. గ‌తంలో టీడీపీ పాల‌న‌లో కూడా సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోకుండా.. కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్లు.. పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారు. ఇప్పుడు వైసీపీలోనూ అనేక మంది సీనియ‌ర్లు త్యాగాలు చేశారు. వారంతా అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. కొంద‌రికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వుల‌పై హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో వారంతా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం.. ఇద్ద‌రు కొత్త‌వారికి ఎమ్మెల్సీలు, ఇద్ద‌రు పాత‌వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించింది. 

 

దీనిపై ఫోక‌స్ చేసిన వైసీపీ నాయ‌కులు.. త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నారు. ``అన్నా ఇప్పుడు కూడా సీనియ‌ర్ల‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే.. ఎలా?  ఇలా అయితే.. బాస్‌ను న‌మ్ముకుని వారు ఏం సాధించిన‌ట్టు.. త్యాగాలు వృథాగా పోవాల్సిందేనా? ఉద్దేశ పూర్వ‌కంగానే బాస్ ఇలా చేస్తున్నాడా?  ఇలా అయితే ఎలా గ‌బ్బా!`` అంటూ.. వైసీపీ నాయ‌క‌లు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక‌రికొక‌రు ఫోన్లు చేసుకుని.. ఒక్క ఛాన్స్ జాబితాలో ఉన్న నాయ‌కులు.. జ‌గ‌న్ హామీ ఇచ్చిన నాయ‌కుల పై చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై ఒక‌రిద్ద‌రు ఒక్కొక్కరకంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పీఠాలు ఉన్నాయ‌ని... కాబ‌ట్టి కొంత వెయిట్ చేస్తే.. అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా.. ఈ ఎమ్మెల్యేలు, మంత్రుల విష‌యం.. తాజాగా వైసీపీని కుదిపేస్తోంద‌న్న‌ది వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: