రాష్ట్రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. అది కూడా టీడీపీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు అచ్చోసిన అక్ష‌రాల ‌తో నిత్యం క‌మ్మ‌నైన విందు చేసే ఆ పార్టీకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన‌బ‌డే ఎల్లో మీడియాలోనే!  రాష్ట్రంలో చం ద్రబాబు  రెండోసారి అధికారంలోకి రాలేక పోవ‌డం ఆయ‌న‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఎల్లో మీడియాకు మా త్రం చాలా బాధాక‌రంగా ఉంది. `బాబుకు త‌ప్ప వేరేవారికి ఓటేశారో.. మీ ఖ‌ర్మ‌` అంటూ.. గ‌త ఏడాది ఎన్ని క‌ల‌కు ముందు వింత ప‌లుకులు ప‌లికిన ఎల్లో మీడియా ప్ర‌జ‌ల‌ను బాబు బుట్ట‌లో వేసేందుకు వేయ‌ని వేషం లేదు. రాయ‌ని రాతా లేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయి చంద్ర‌బాబుకు ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో బాబును స‌మ‌ర్ధించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. 


అంటే.. ప్ర‌త్య‌క్షంగా గ‌తంలో చంద్ర‌బాబును స‌మ‌ర్థించిన బీజేపీ, జ‌న‌సేన‌లు ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వైరంతో ఉన్నాయి. అయితే, ఇది కూడా పొత్త‌ల్లో ఒక తెర‌చాటు పొత్త‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. స‌రే.. ఏదేమైనా.. ఇప్పుడు చంద్ర‌బాబును, ఆయ‌న పార్టీని ప‌క్కాగా మోస్తున్న‌ది ఎల్లో మీడియానే! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. కానీ, ఇప్పుడు ఈ ఎల్లో మీడియానే టీడీపీ నేత‌ల విష‌యంలో వివ‌క్ష చూపుతోంద‌నే ప్ర‌చా రం సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌ల కాల్లో ముల్లుగుచ్చుకున్నా.. గుండెల్లో గున‌పం దిగిన‌ట్టు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈఎస్ ఐ కుంభ‌కో ణా నికి సంబంధించి.. సుమారు 151 కోట్ల‌ను దోచేశార‌ని పేర్కొంటూ.. ఏసీబీ అధికారులు మాజీ మంత్రి.. ప్ర‌స్తు త టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చ‌న్నాయుడును అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. 

 

గ‌త నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న పై ఎల్లో మీడియా భారీ రేంజ్‌లో క‌వ‌రేజ్ ఇచ్చింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తూర్పార‌బ‌ట్టే కార్య‌క్ర‌మం బాగానే పోషించింది. అదేస‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌కు బీసీ కార్డును జ‌త చేసి.. మ ‌రీ .. ఈ మీడియా రెచ్చిపోయింది. వాస్త‌వానికి టీడీపీ నేత కాబ‌ట్టి, మాజీ మంత్రి కాబ‌ట్టి.. ఆ పార్టీ నేత‌లు విరు చుకుప‌డాలి. కానీ, చిత్రంగా ఈ విష‌యంలో ఎల్లో మీడియాలోని ఓ ద‌మ్మున్న మీడియా మ‌రింత‌గా రెచ్చి పోయింది. బీసీలంటే.. జ‌గ‌న్‌కు ఇష్టం లేద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది. ఇక‌, ఏమేర‌కు సెంటి మెం టు పండుతుందని భావిస్తే.. ఆమేర‌కు సెంటిమెంటును పండించింది కూడా!  అచ్చ‌న్న‌కు ఆప‌రేష‌న్ అయింద‌ని, క‌నీసం ఆయ‌న‌ను విశ్రాంతి కూడా తీసుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండానే లాక్కొచ్చార‌ని, ఊరంతా తిప్పార‌ని.. ఇలా అనేక రూపాల్లో సెంటిమెంటును పండించింది. 

 

దీంతో టీడీపీ నేత‌లు అంద‌రూ కూడా ఎల్లో మీడియాకు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో జేజేలు ప‌లికారు. ``మ‌మ్మ ల్ని న‌డిపించే దైవం నువ్వే.. మా పాలిట బంధువు.. ఆత్మ‌బంధువు నువ్వే``- అంటూ.. మోక‌రిల్లారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ను కూడా పోలీసులు అ రెస్టు చేశారు. మంత్రి పేర్ని నానికి అత్యంత స‌న్నిహితుడు మోకా భాస్క‌ర‌రావు కేసులో ప్ర‌మేయం ఉంద ‌ని అందుకే కొల్లును అరెస్టు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. అయితే, చిత్రంగా  కొల్లు అరెస్టు విష‌యా న్ని ఎల్లో మీడియా ప‌క్క‌న పెట్టేసింది. అచ్చె‌న్నాయుడుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోగా.. క‌వ‌రేజీ విష‌యంలోనూ ప్రాధాన్యం లేకుండా చేసేసింది. మ‌రి అదే బీసీ వ‌ర్గానికి చెందిన కొల్లును అరెస్టు చేస్తే.. ఒక‌లా.. అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే.. ఒక‌లా స్పందించ‌డం, ప్రాధాన్యం లేకుండా చేసేయ‌డం వంటివి గ‌మ‌నిస్తే.. ఎల్లో మీడియా ఏంటి ఇలా చేసింది? అని అన‌కుండా టీడీపీలోనే నేత‌లు ఉండ‌లేక పోతున్నార‌ట‌!! 

మరింత సమాచారం తెలుసుకోండి: