రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలీదు. ఎప్పుడు ఏది జ‌రిగినా.. మ‌న మంచికే అనుకునే పార్టీలు ఉన్న నేటి రోజుల్లో.. అవ‌కాశం-అవ‌స‌రం అనే రెండు ప్రాధాన్యాలపైనే పొలిటిక‌ల్ విన్యాసం చేస్తార‌నేది వా స్త‌వం. అయితే, ఈ అవ‌కాశాలు.. అవ‌స‌రాలు.. త‌న‌కు ఇష్టంలేద‌ని, తానంటూ.. ప్ర‌శ్నించేందుకు మాత్ర‌మే రాజ‌కీయ వేదిక‌పై వ‌చ్చాన‌ని చెప్పుకొన్న‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సొంత‌గా పార్టీని పెట్టుకున్నారు.  జ ‌న‌సేన పార్టీని స్థాపించి యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని, పార‌ద‌ర్శ‌క రాజ‌కీయాలు చేస్తాన‌ని, అధికారం త‌న యాంబిష‌న్ కాద‌ని, త‌న‌కు పాతికేళ్ల ప్ర‌స్థానం ఉంద‌ని, ఇలా అనేక విష‌యాల్లో ఆయ‌న సినిమా డైలాగుల ‌ను మించిపోయేలా డైలాగుల‌ను పేల్చారు. 


ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.. ఇక‌, త‌ర్వాత కాలంలో జ‌రిగిన ప‌రిణామాలు.. పెట్టుకున్న పొత్తులు, వేసిన పొ లిటిక‌ల్ డ్యాన్సులు అంద‌రికీ తెలిసిన‌వే! 2014లో పొత్తులు పెట్టుకుని, 2019లో విడిపోయిన పార్టీగా జ‌న ‌సేన ముద్ర వేసుకుంది. అదే ఎన్నిక‌ల్లో .. ఒంట‌రిగానే పోటీని ఎదుర్కొని.. జ‌గ‌న్‌పై వ్యూహాత్మ‌కంగా దాడి చే సిన ఈ పార్టీ.. అధినేత ప‌వ‌న్‌.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్నార‌నే వాద‌న‌ను ఎదుర్కొన్నారు. ఇక‌, జ‌న‌సేన‌లో ప‌వ‌న్ ఏదో పార‌ద‌ర్శ‌కంగా ముందుకు సాగుతున్నార‌ని అనుకున్నారో.. లేక‌.. జ‌గ‌న్‌కు దీటైన నాయ‌కుడు ప‌వ‌నేన‌ని భావించారో కొంద‌రు కీల‌క నాయ‌కులు ప‌వ‌న్ పంచ‌కు చేరిపోయారు. ఎన్నిక‌ల్లో పో టీ కూడా చేశారు. 


అయితే, ఎన్నిక‌ల్లో ఒక్క‌రు త‌ప్ప అంద‌రూ ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఎక్క‌డో ఉన్న మాయావ‌తిని, యూపీ ప్ర‌జ‌లు తిప్పికొట్టిన మాయావ‌తిని ఏపీకి తీసు కువ‌చ్చి.. వేదిక‌ల‌పై పొర్లు దండాలు పెట్టిన ప‌వ‌న్‌.. ఎస్సీ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టేందుకు లేదా చీల్చేం దుకు వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేశారు. అయితే, ఇవ‌న్నీ.. పాత‌చింత‌కాయ్ ప‌చ్చ‌డి లాంటి క‌బుర్లు క‌దా.. ఇప్పుడు ఇవ‌న్నీ ఎందుకు? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. ఎందుకంటే.. వీటినే ఇప్పుడు జ‌న‌సేన‌లో మిగిలి ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కులు ఈ అంశాల‌నే చ‌ర్చించుకుంటున్నారు. `చెవిలో చిన్న‌మాట‌`-అంటూ.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను కూడా జోడించి చ‌ర్చ‌పెట్టారు. 


ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన ఏడాది కాలంలో ప‌వ‌న్ బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. ఇంత‌టితో ఊరుకోకుండా.. పార్టీని కూడా దాదాపు బీజేపీకి అప్ప‌గించిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు.. నిన్న మొన్న టి వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ స‌ర్కారును చావ‌కొట్టి చెవులు మూస్తాన‌ని బీరాలు ప‌లికిన ఈ ప‌వ‌న్ అనే పెద్ద‌మ‌ని షి.. అనూహ్యంగా జ‌గ‌న్ ను ఆకాశానికి ఎత్తేయ‌డంతో ఈ ప్ర‌శ్నించే పార్టీలోని నేత‌ల‌కు త‌ల‌బొప్పిక‌ట్టినంత ప‌నైంద‌ట‌!  అధికారంలో ఉన్న పార్టీని విమ‌ర్శించాలి.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాలి.. అయితే.. దీనికి విరుద్ధంగా జానీ వ్య‌వ‌హారం ఉంది.. ఇలా అయితే.. మనం కూడా చిద‌త‌లు ప‌ట్టుకుని చ‌క్క‌భ‌జ‌న చేయ‌డ‌మే బెట‌రేమో! అని చెవిలో చిన్న‌గా గుస‌గుస‌లాడుతున్నార‌ట‌.. జ‌న‌సేన సైన్యంలో కీల‌క యోధులు!  


గ‌తంలోనూ ప‌వ‌న్ ఇలానే వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌మ‌కు ఏం చేయాలో పాలుపోలేద‌ని వారు చెప్పుకొంటు న్నార‌ట‌. అధికారంలో ఉన్న చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం మానేసి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌ను తీవ్ర ‌స్థాయిలో దుమ్మెత్తిపోశార‌ని, ఇప్పుడు మ‌ళ్లీ రివ‌ర్స్ అయి.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇలా అయితే.. పార్టీ ఏం బాగుప‌డుతుంద‌ని, ఇప్ప‌టికే నేత‌లు లేక కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించే ప‌రిస్థితి లేకుండా పోయిం ద‌ని  జ‌న‌సేన నేత‌లు.. చెవులు కొరుక్కుంటున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసిన నోటితోనే.. ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని, ఇదేం రాజ‌కీయ‌మో అర్ధం కావ‌డం లేద‌ని చెవిలో చిన్న‌గానే అయినా.. పెద్ద విష‌యాన్నే చ‌ర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: