తెలుగు మీడియాలో నిన్న‌, తెలుగు ప‌త్రిక‌ల్లో ఈ రోజు రాజ‌ధాని అమ‌రావ‌తిపై వ‌చ్చిన క‌థ‌నాలు, విశ్లేష‌ణ ‌లు, ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు.. వ‌ర్చ్యువ‌ల్ ర్యాలీలు, ఎక్క‌డెక్క‌డి నుంచో రియాక్ట్ అయిన‌ ప్ర‌జ‌ల వ్యాఖ్య‌లు వంటివి చూసిన త‌ర్వాత `జ‌గ‌న్‌-చంద్ర‌బాబు-అమ‌రావ‌తి`- అనే టాపిక్‌పై సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు  హోరెత్తి పోయాయి. దీంతో ఆవేశం, ఆక్రంద‌న‌.. వీటికి కొంత `ప్రోద్బ‌లం`, మ‌రికొంత సెంటిమెంటు క‌ల‌వ డంతో స హజంగానే రాష్ట్రానికి ఏదో అన్యాయం జ‌రిగిపోతోంద‌ని.. రాష్ట్రానికి ప‌ట్టుగొమ్మ‌, అమృత భాండం వంటి అమ‌రావ‌తికి ఏదో జ‌రిగిపోతోంద‌ని.. చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోవ‌డం, ఆయ‌న‌కు ఓట్లు వేయ క‌పోవ‌డం.. ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు  చేసుకున్న బ‌హుకృత ఘోరాప‌రాధ‌మ‌ని కొంద‌రు సూత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. 


వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఏ పార్టీ అయినా.. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామ‌ని, రాష్ట్రానికి అభివృద్ధి బాట‌లు వేస్తామ‌నే చెబుతుంది. ఎందుకంటే మ‌న‌ది నియంత్రిత దేశం కాదు.. ఇక్క‌డ ఎవ‌రూ రాజులు లేరు. ప్ర‌తి ఐదేళ్ల‌కు ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డాల్సిన అత్యంత అవ‌స‌రం ఉంటుంది. సో.. అయినా.. కూడా ప్ర‌భుత్వా ల చేత‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీనికి కార‌ణం ఏంటి?  ఎందుకు ఇలా సున్నిత అంశాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారానో.. లేక ప్ర‌భుత్వాల‌పై వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డం ద్వారాలో ల‌బ్ధి పొందాల‌ని చూడ డం! ఈ చ‌ర్చ‌కొన్ని ద‌శాబ్దాలుగా ఈ దేశంలో సాగుతూనే ఉంది. అయినా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గానే ఉంది. ప‌రిణామ క్ర‌మంలో చోటు చేసుకునే మార్పును అంగీక‌రించేందుకు మ‌నిషి మ‌న‌సు ఒప్పుకోదు! దీనిని ఛార్లెస్ డార్విన్ త‌న ప‌రిణామ సిద్ధాంతంలో ఎప్పుడో చెప్పుకొచ్చారు. 


ఇప్పుడు రాష్ట్రంలోనూ జ‌రుగుతున్నది మార్పే!  గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మైనా.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర భుత్వమైనా.. మార్పుల దిశ‌గానే ప‌య‌నించాయి. కానీ, ఒక్క అమ‌రావ‌తి విష‌యంలోనే తెలియ‌ని అల‌జ‌డి ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చి దృశ్యాల‌ను క‌ప్పేసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే ప‌రిణామా ల‌ను జీర్ణించుకోలేక పోతున్న‌ది. ఒక ప‌రిణామం వెనుక‌.. అనేక త‌రాల‌కు సంబంధించిన విష‌యాలు మ‌రుగున ప‌డ‌తాయి. అయితే, ఆ త‌ర్వాతే.. `అస‌లు` విష‌యం ఏంట‌నేది బోధ‌ప‌డుతుంద‌ని చెబుతారు డార్విన్‌. అమ‌రావ‌తి విష‌యంలోనూ ఇప్పుడు జ‌రుగుతున్న `ప‌రిణామ‌మే`!  రాష్ట్ర ఉన్న‌తికి అమ‌రావ‌తి దోహ‌ద‌ప‌డని కానీ, అస‌లు అమ‌రావ‌తితో ప్ర‌యోజ‌నం లేద‌ని కానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎక్క‌డా వెల్ల‌డించ‌లే దు. దీనిని గ‌మ‌నించేందుకు కొంత హేతుబ‌ద్ధ‌త‌.. అవ‌స‌రం!

 

రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసినప్పుడు జ‌గ‌న్ జై కొట్టారు అనేది చంద్ర‌బాబు వాద‌న‌. దీనినే తీసుకున్నా.. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి రాజ‌ధానిపై ఏర్పాటైన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఏం చెప్పిందో .. దానిలోని కొన్ని అంశాల‌ను కూడా తీసుకుని ఆ విధంగా ముందు కు వెళ్లాల‌ని జ‌గ‌న్ సూచించిన మాట వాస్త‌వం. కానీ, నాడు చంద్ర‌బాబు ఈ నివేదిక‌తోపాటు మేధావుల సూచ‌న‌ల‌ను, ప్ర‌తిప‌క్షాల  వాద‌న‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. త‌న‌కు న‌చ్చిన విధంగా అడుగులు వేశారు. ఫ‌లితంగా మ‌రో తెలంగాణ వంటి ఉద్య‌మానికి సీమ జిల్లాలు, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పురుడు పోసుకునే అవ‌కాశం ఉంద‌న్న‌ది జ‌గ‌న్ స‌హా ఎంతో మంది మేధావుల వాద‌న‌. అయినా కూడా చంద్ర‌బాబు త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకున్నారు. 


సైబ‌రాబాద్‌ను ముందుకు తోసి .. తాను వెనుక నిల‌బ‌డ్డారు. కానీ, సైబ‌రాబాద్ వేరు.. అమ‌రావ‌తి వేరు!  కేవ లం ఐటీని ఉద్దేశించి చేసిన ఏర్పాటు సైబ‌రాబాద్‌. ఇది రాజ‌ధాని కాదు కూడా! కానీ, అమ‌రావ‌తి విష‌యం వేరు ఇది మొత్తం 13 జిల్లాల‌కు రాజ‌ధాని కేంద్రంగా పేర్కొన్నారు. నిజానికి అప్ప‌టికే వెనుక‌బాటుతో అల్లా డుతున్న ఉత్త‌రాంధ్ర‌కు కానీ, సీమ ప్ర‌జ‌ల కోరిక‌ల‌ను కానీ ఇది తీర్చే ప్ర‌య‌త్నం చేయ‌జాల‌దు అన‌డంలో సందేహం లేదు. అంతేకాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల‌ను ఇక్క‌డ వెచ్చించి నిర్మాణా లు చేయాల్సి వ‌స్తుంది. దీనివ‌ల్ల సొమ్ము అంద‌రిదీ.. సొకు ఒక్కరిదీ అనే నానుడికి బీజం ప‌డిన‌ట్టు అవు తుంద‌న్నది కూడా ఒక వాద‌న. ప‌రిణామం అనేది అన్ని అవ‌య‌వాల‌కూ వినియోగ‌ప‌డాల‌నే సిద్ధాంతం ఇక్క‌డ వ‌ర్తించే అవ‌కాశం లేదు. 

 

అందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తిని ఏక‌రూప రాజ‌ధానిగా కాకుండా.. త్రిముఖంగా విస్త‌రించేందుకు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. దీనిని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు, సీమ ప్ర‌జ‌లు కూడా స్వాగ‌తించారు. త‌ద్వారా రాష్ట్రంలో చోటు చేసుకునే ప‌రిణామం.. స‌ర్వ‌తోముఖాభివృద్ధిగా ఉంటుంద‌నే సూత్రం కూడా దీనిలో ఇమిడి ఉంది. ఈ అస‌లు సిస‌లు సూత్రాన్ని ప‌క్క‌న పెట్టి చేస్తున్న విన్యాసం.. సెంటిమెంటును రెచ్చ‌గొడుతూ.. స్వ‌ల్ప‌కాలిక సౌఖ్యాన్ని పొందేందుకు పావులు క‌దుపుతున్న‌దే త‌ప్ప‌.. రాష్ట్ర ప్ర‌జ‌ల సుదీర్ఘ స్వ‌ప్నాన్ని.. సాకారం చేసే అవ‌కాశం క‌ల్పించ‌డం లేద‌న్న‌ది విజ్ఞుల మాట‌. అలాగ‌ని.. పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాలా?  లేక అమ‌రావ‌తిలోనే ఉంచాలా? అనే విష‌యంపైనా విస్తృత చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. 


మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ అయినా.. చంద్ర‌బాబు అయినా.. ప్ర‌జ‌ల కోసం చేసే మార్పుల్లో ప‌రిణామాల‌ను శో షీక‌రించే ప్ర‌క్రియ‌ను ప్ర‌జాహితంగానే చేప‌ట్టాలి త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త అజెండాలు.. జెండాల మాటున.. మార్పు ను సూత్రీక‌రిస్తే.. సుదీర్ఘ స్వ‌ప్నం చెదిరిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. దీనినే డార్విన్ కొన్ని శ‌తాబ్దాల కింద‌టే చెప్పుకొచ్చారు. నాడు, నేడు ఏనాడూ.. దీనికి అంద‌రూ బ‌ద్ధులే. ప‌రిణామంలో విప‌రిణా మాలు రాకుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కొంద‌రు చేసే అతి.. అంద‌రికీ ద‌ఖ‌లు ప‌డి.. విప‌రిణామాలు ఏర్ప‌డితే.. న‌ష్ట‌పోయేది విశాల జ‌నాభ్యుద‌య‌మే త‌ప్ప‌.. మ‌రేమీ లేద‌నే విష‌యాన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్షాలు గుర్తెరిగిన‌ప్పుడు.. ప‌రిణామ క్ర‌మం ప‌రిఢ‌విల్లుతుంద‌నేది వాస్త‌వం!!

మరింత సమాచారం తెలుసుకోండి: