``నేను పార్టీకి వ్య‌తిరేకం కాదు.. అధినేతను ఏమీ అన‌లేదు.. న‌న్నెందుకు పార్టీ నుంచి స‌స్సెండ్ చేస్తా రు``- ఇదీ న‌ర‌సాపురం ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. శ్రీమాన్ కిన‌మూరి ర‌ఘురామ‌కృష్ణంరాజుగారునిన్న మొ న్న‌టి వ‌ర‌కు త‌న‌నుతాను చేసుకున్న స‌మ‌ర్ధ‌న‌. అనుంగు మీడియాలు, వైసీపీ వ్య‌తిరేక ఛానెళ్లు.. ఆయన ‌ను బాగానే ప్రొజెక్ట్ చేశాయి. అయితే, తాజాగా కూడా ఆయ‌న లేదులేదంటూనే.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పె ట్టేశార‌ని, ఇలా అయితే.. ఆయ‌న చేసింది.. పార్టీ వ్య‌తిరేక ప‌నికాదా? అంటూ.. చెవిలో చిన్న‌గా చెప్పుకొంటు న్నారు.. వైసీపీ నాయ‌కులు. వ్య‌తిరేకం కాదు.. కాదు.. అంటూనే పార్టీకి న‌డిబ‌జారులో బ‌ట్టులు విప్పేస్తు న్నారే.. ! అని చెవు లు కొరుక్కుంటున్నారు. 


ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ వ్య‌వ‌హారం న‌ర‌సాపురం పురం నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఎగ‌బాకిన విష‌యం తెలిసిందే. అత ‌ను మామూలోడు కాదు. జ‌గ‌న్‌కే చుక్క‌లు చూపిస్తున్నాడు! అనే వ్యాఖ్య‌లు వైసీపీ నుంచే వినిపించా యి. ఇం కా వినిపి‌స్తూనే ఉన్నాయి. నిజానికి త‌న‌కు ఏదైనా బాధ‌క‌లిగితే.. అధిష్టానానికి లేఖ‌లు రాయొచ్చు .. లేదా సూ చ‌న‌లు చేయొచ్చు.. కానీ, ఎత్తుకోవ‌డం ఎత్తుకోవ‌డమే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని మించిపోయే రేంజ్ ‌లో విమ‌ర్శ‌లు ఎత్తుకున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రైనా అడిగితే.. నేను పార్టీని తిట్టానా?  అధినేత జ‌గ‌న్ ‌ను ఏమ‌న్నా అన్నానా? అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకుంటున్నారు. రాజ‌కీయ మేధావుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కుల‌కే ర‌ఘు వ్య‌వ‌హార శైలి అంతుచిక్క‌డం లేదు. దీంతో వైసీపీలోనూ ర‌ఘు విష‌యాన్ని ఎవ‌రూ బ‌హిరంగంగా మాట్లాడొద్ద‌ని పార్టీ ఆదేశించింది. 


దీంతో తాజాగా ర‌ఘు చేసిన వ్యాఖ్య‌లు, ప్ర‌బుత్వంపై లేదులేదంటూనే చేసిన విమ‌ర్శ‌ల‌ను పార్టీ నాయ‌కు లు చెవిలో చిన్న‌గా చెప్పుకొంటున్నారు. రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుం టే.. తాను దీనికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌తారు. అదేస‌మ‌యంలో ఇది పార్టీకి వ్య‌తిరేకం కాద‌ని, ప్ర‌బుత్వానికి సూచ‌న అంటూ.. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా మొన్న 200వ రోజు జ‌రిగిన ఆందోళ‌న‌లో ఆయ‌న మాట్లాడారు. ఇక‌, తాజాగా.. అవ్వాతాత‌ల పింఛ‌న్లు  పెంచి ఇవ్వాల‌ని, వారి వృద్ధాప్య వ‌య‌సును త‌గ్గిస్తూ.. జీవో ఇచ్చార ని, దీనిని గ‌త ఏడాది నుంచి అమ‌లు చేయాల‌ని.. ఒక్కొక్క‌రి అకౌంట్‌లో రూ.15 వేల చొప్పున వేయాల‌ని.. ఇలా త‌న‌కు న‌చ్చిన విధంగా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సూచ‌న‌లు మాత్ర‌మే చేశాన‌ని, కానీ, జ‌గ‌న్‌ను కానీ, పార్టీని కానీ ఏమీలేద‌ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. 


కానీ, ఇలాంటి వ్యాఖ్య‌లు, విన్యాసాలు చూస్తున్న వైసీపీ నాయ‌కులు .. ఇదంతా ద‌గుల్బాజీ రాజ‌కీయం కింద‌కే వ‌స్తుంద‌ని.. ఇలాంటి వాడికి టికెట్ ఇచ్చి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని.. చెవిలో చిన్న‌గా చెప్పుకొంటున్నా రు. ప్ర‌స్తుతం ఆయ‌నపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో దీనిపై నిర్ణ‌యం వెలువ‌డే వ‌ర‌కు కూడా వేచి చూడ‌డం త‌ప్ప వైసీపీ చేయ‌గ‌లిగింది ఏమీ లేని నేప‌థ్యంలో నేత‌లు ఒక‌రి కొక‌రు ఫోన్లు చేసుకుంటూ.. ఈ వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రున్నారు? అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాల‌ను ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ర‌ఘు విష‌యం ఇంకా ర‌గులుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: