వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవితంలో అనేక విమ‌ర్శ‌లు.. ప్ర‌త్య‌ర్థుల మాట‌ల‌ దాడులు.. ప్ర‌తిప‌క్షాల దూకుడు వంటివి అనేకం ఎదుర‌య్యాయి. అదేస‌మ‌యంలో విప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. టీడీపీకి అనుకూల పత్రిక‌లైన ఆంధ్ర‌జ్యోతి, ఈనాడుల నుంచి కూడా వైఎస్ అనేక రూపాల్లో దాడులు ఎదుర్కొన్నారు. నిత్య‌మూ.. ప‌త్రిక ల‌తో ఆయ‌న సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌య్యేవారు. ఇలాంటి స‌మ‌యంలోనే ఆయ‌నను రాజ‌కీయంగా, మాన‌సికంగా కూడా దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాలు ఎంత దూరం వెళ్లాయంటే.. ఆయ‌న అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా సాగాయి. ఇలాంటి విష‌య‌మే ఒక‌టి వైఎస్ జీవితంగా ఒకటి జ‌రిగింది. 


ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఈ విష‌యంపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. విష‌యం ఏంటంటే.. 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగిన 2009లో కూడా వైఎస్ దూకు డు పెంచారు. అయితే, ఆ స‌మ‌యానికి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే బాధ్య‌త కూడా పార్టీ అధిష్టా నం వైఎస్‌కే అప్ప‌గించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కుమారుడు.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాజ కీయాల్లోకి తీసుకురావాల‌ని భావించారు. దీనికి కూడా కుటుంబం నుంచి కంటే.. స్థానిక జిల్లా నేత‌ల నుం చి ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అదేస‌మ‌యంలో వైఎస్ సోద‌రుడు.. అప్ప‌టి సిట్టింగ్ ఎంపీ వైఎస్ వివేకానంద ‌రెడ్డి కూడా జ‌గ‌న్‌కు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. 


వాస్త‌వానికి చిత్తూరు జిల్లాతో క‌లిపి క‌డ‌ప‌తోనూ సంబంధం పంచుకుని ఉన్న రాజంపేట నియ‌జ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్‌ను పోటీ చేయించాల‌ని ప్ర‌తిపాదించారు. దీనివ‌ల్ల చంద్ర‌బాబు సొంత జిల్లాలో వ్యూహాత్మ‌కం గా.. కాంగ్రెస్‌ను ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఈ స‌మ‌యంలో అనూహ్యంగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న క‌డ‌ప ఎంపీ స్థానం నుంచే జ‌గ‌న్‌ను నిల‌బెట్టాల‌ని! ఈ క్ర‌మంలో దీనిపై నిర్ణ‌యం తీసుకోవ‌డం, నామినేష‌న్ వేసే వ‌ర‌కు కూడా ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచ‌డం అన్నీ జ‌రిగిపోయాయి.  ఆఖ‌రుకు.. జ‌గ‌న్ నామినేష‌న్ వేసిన త‌ర్వాత కానీ.. విష‌యం మీడియాకు కూడా అంద‌లేదు. 


అయితే, అనూహ్యంగా క‌డ‌ప టికెట్‌ను జ‌గ‌న్‌కు కేటాయించ‌డంపై వైఎస్ ప్ర‌త్య‌ర్థి మీడియా విరుచుకుప డింది. వైఎస్ వివేకానంద‌రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్‌ను వైఎస్ బ‌లవంతం చేసి జ‌గ‌న్‌కు ఇప్పించుకున్నార ‌ని, ఈ విష‌యంలో వివాకాను వైఎస్ బెదిరించార‌ని ఒక ప‌త్రిక‌, వివేకాకు క‌నీసం స‌మాచారం కూడా లేకుం డానే లాగేసుకున్నార‌ని ఓ ప‌త్రిక వార్త‌లు ప్ర‌చురించి గంద‌ర‌గోళం సృష్టించాయి. అయితే, ఈవిష‌యంపై రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎప్పుడూ పెద‌వి విప్ప‌లేదు. అయితే, ఆయ‌న మ‌ర‌ణాంత‌రం.. చానాళ్ల‌కు ఈ విష‌యంపై మాట్లాడిన వివేకా.. త‌ను ఇష్ట‌పూర్వ‌కంగానే వ‌దులుకున్నాన‌ని.. త‌నకు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిం చాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే, దీనిని ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు విభేదించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యం.. ఇప్ప‌టికీ గుస‌గుస‌గా వైసీపీ స‌హా కాంగ్రెస్ శ్రేణుల్లో చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: