ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఫలితంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరగడం, ఫైనల్ గా సముద్ర మట్టాలు స్థాయి పెరగడం వంటివి సంభవిస్తాయని అందువల్ల సముద్ర తీరాన్ని కలిగి ఉన్న ప్రాంతాలను కొంచెం… కొంచెం కనుమరుగు అయిపోతున్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు నిత్యం వెల్లడిస్తుంటారు.


అయితే వీరి సూచనలు, హెచ్చరికలను మెజార్టీ ప్రజలు పరిగణనలోకి తీసుకోరు అనే చర్చ కూడా రోజూ సాగుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రోపాలకు కూడా ఈ కాలుష్యమే కారణం అంటుంటారు. ఈ సమయంలో బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ షాకింగ్ విషయాలను వెల్లడించింది.


ఈ సందర్భంగా 1987-2021 మధ్య పెరిగిన సముద్ర నీటి మట్టాన్ని లెక్కిస్తూ.. ఫ్యూచర్ లో ముంబయి, చెన్నై, వైజాగ్, తిరువనంతపురం, మంగుళూరు, కోచి, హాల్దియా, కోజికట్, కన్యా కుమారి, ఫనాజీ, ఉడిపి, తుత్తుకుడి, పూరి యానంలలో ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టింది. ఈ సందర్భంగా 2021 వరకు ఈ నగరాల్లో సముద్ర మట్టాలు ఏ స్థాయిలో పెరిగాయి అనేది తెలిపింది.

ఇందులో భాగంగా.. ముంబయి(4.44 సెం.మీ.), హాల్దియా(2.72 సెం.మీ), విశాఖ పట్నం(2.38 సెం.మీ), కోచి(2.21సెం.మీ.), చొప్పున సముద్ర మట్టాల స్థాయి అత్యధికంగా పెరిగిందని తెలిపింది. ఈ లెక్కన చూసుకుంటే 2040 నాటికి భారత దేశ ఆర్థిక రాజధాని ముంబయి 10 శాతానికి పైగా మునిపోతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.


ఇక ఏపీ ఆర్థిక రాజధానిగా చెబుతున్న విశాఖ పట్నంతో పాటు మంగళూరు, కోచి, పూరి, ఉడిపి నగరాలు కూడా 1నుంచి 5  శాతం వరకు భూ భాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది. ఇక కార్బన్ ఎమిషన్స్ శాతం భారీగా పెరిగితే.. పైన చెప్పుకున్న ప్రాంతాల్లో సముద్రంలో కలిసిపోయే భూభాగం శాతం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: