తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి ఊహించని దెబ్బపడింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో కరోనావైరస్ కారణంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. పవన్ ప్రచారంపైనే బీజేపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అందుకనే పదేపదే వకీల్ సాబ్ సినిమా బంపర్ హిటవ్వాలని, సూపర్ హిటవ్వాలంటు అభ్యర్ధి రత్నప్రభతో పాటు సీనియర్ నేతలు పదే పదే కోరుకుంటున్నది. పవన్ సినిమా హిట్టయితే అభిమానులు, జనాలు బీజేపీకి ఓట్లేస్తారనే పిచ్చభ్రమలో ఉన్నారు. అదే ఊపులో పవన్ ఆధ్వర్యంలో రోడ్డుషోలు, బహిరంగసభలు కూడా కమలనాదులు ప్లాన్ చేశారు. అయితే తాజా పరిణామాలు కమలనాదులకు ఊహించని రీతిలో షాక్ కొట్టింది.



కొంతకాలంగా పవన్ కల్యాణ్ వ్యవహారాలు చూస్తున్న వారికి, సెక్యురిటి సిబ్బందితో పాటు కొందరు సన్నిహితులకు కరోనా వైరస్ సోకుతోందట. దాంతో పవన్ కు కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి కొద్దిరోజులుగా పవన్ ఎక్కడా బహిరంగ ప్రాంతాల్లో కనబడలేదు. చివరకు వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో కూడా ఎక్కడా కనబడలేదు. సినిమా ఫంక్షన్ను పక్కన పెట్టేసినా చివరాఖరుకు తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో కూడా కనబడలేదు. దాంతో పవన్ కు ఏమైందనే విషయంపై సస్పెన్సు పెరిగిపోయింది.



ఒకవైపు బీజేపీ అగ్రనేతలతో ఉపఎన్నిక ప్రచారాన్ని హోరెత్తించేసేందుకు రెడీ అవుతోంది. బీజేపీ తరపున ఢిల్లీ నుండి ఎంతమంది అగ్రనేతలు హాజరైనా ఏమీ ఉపయోగం ఉండదన్న విషయంలో సందేహంలేదు. 12వ తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి వస్తున్నారు. నడ్డా బహిరంగసభ+రోడ్డుషోలు ప్లాన్ చేశారు. నడ్డా వచ్చినా కూడా పవన్ లేకపోతే వందమంది కూడా జనాలుండరు. తమ రోడ్డుషోల్లోను, ప్రచారంలోను పవన్ను ముందుపెట్టి షో రన్ చేయాలని బీజేపీ స్ధానిక నేతలనుకున్నారు. కానీ ఇపుడు హఠాత్తుగా పవన్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళిపోవటంతో కమలనాదులకు దిక్కుతోచటంలేదు.  అసలు 15వ తేదీసాయంత్రంలోగా పవన్ మళ్ళీ తిరుపతిలోకి వచ్చేది లేనిది కూడా తెలీటంలేదు. మొత్తంమీద ఎన్నికలప్రచారం నాలుగురోజుల్లో ముగుస్తుందనగా బీజేపీని కరోనా బాగా దెబ్బకొట్టినట్లే అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: