టోక్యో ఒలింపిక్స్.. ఇప్పుడు క్రీడాజగత్తులో అంబరాన్నంటే  ఆటల సంబరం.. కొన్ని రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఈ ఒలింపిక్స్ జరగుతున్నాయి. అయితే తాజాగా ఈ ఒలింపిక్స్ వ్యూయర్షిప్‌ లెక్కలు నిర్వహాక దేశం జపాన్‌కు షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే.. గత రియో ఒలింపిక్స్ రేటింగ్స్‌తో పోలిస్తే.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ రేటింగ్ బాగా తగ్గిపోయాయి.. టీవీ, నెట్ వంటి అన్ని వేదికలపై వ్యూయర్‌షిప్‌ లెక్కలు ఏకంగా మూడో వంతు తగ్గిపోయాయి.


సాధారణంగా ఏ ఏటికాయేడాది వ్యూయర్షిప్ పెరగాలి.. ఇప్పుడు కరోనా కారణంగా జనం ఆన్‌లైన్‌లోనే ఒలింపిక్స్ చూస్తున్నారు.. గత నాలుగేళ్లలో ప్రపంచ జనాభా పెరిగింది.. గతంలో పోలిస్తే.. ఇంటర్‌ నెట్‌ స్ట్రీమింగ్‌ పెరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు పెరిగాయి. ఈ అంచనాల ప్రకారం వ్యూయర్ షిప్ పెరగాలి. కానీ పెరగకపోగా.. అనూహ్యంగా మూడో వంతు పడిపోవడం జపాక్‌కు షాక్ ఇచ్చింది. ఇలా ఎందుకు జరిగిందన్న విశ్లేషణ మొదలైంది.


మరి ఎందుకు వ్యూయర్ షిప్ తగ్గింది.. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అసలు మొత్తం ఒలింపిక్స్ పైనే ప్రపంచ ప్రజలకు ఆసక్తి తగ్గింది. ఎందుకంటే.. వీటిలో ప్రధాన కారణం.. ఈ ఒలింపిక్స్‌లో కొత్త రికార్డులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులకు తక్కువ ఆస్కారం ఉంటోంది. గత పాతికేళ్లలో ఉన్నరికార్డులను దాటి కొత్త రికార్డులు నమోదు కావడం లేదు. అందువల్ల ప్రజలకు ఆసక్తి తగ్గుతోంది.  గతంలో ప్రపంచ క్రీడలకు ఒలింపిక్స్ ఒక్కటే వేదిక.. కానీ ఇప్పుడు ఒలింపిక్స్‌ తో పాటు అనేక ప్రపంచ వేదికలు ఉన్నాయి. అందువల్ల ఒలింపిక్స్ మాత్రమే చూడాలన్న అవసరం లేకుండా పోయింది.


మరో కీలక అంశం ఏంటంటే.. ఇప్పుడు దేశాల మధ్య అంత పోటాపోటీ ఉండటం లేదు. గతంలో అమెరికా, రష్యా మధ్య ఉన్నట్టు ఇప్పుడు ఒలింపిక్స్ పతకాల కోసం దేశాల మధ్య బీభత్సమైన పోటీ లేదు. ఇలా అనేక అంశాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్‌పై ఆసక్తి తగ్గుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: