పట్టుపట్టిదంటే ప్రత్యర్థి ఎవరైనా విజయం తనని వరించాల్సిందే. ఎంతటి బలమైన క్రీడాకారిణినైన తనదైన రోజున మట్టి కరిపించగల సింధు.. విశ్వక్రీడల సెమీస్‌లో అనూహ్యంగా పరాజయం పాలవడం తెలిసిందే. ఆ తర్వాత పుంజుకొని అఖండ భారతావనిని కాంస్య కాంతులతో మురిపించిన తెలుగు తేజం విజయగాధ వెనకాల దాగున్నా కన్నీళ్లు గురించి ఎందరికి తెలుసు? భారత్‌కు వరసుగా రెండోసారి ఒలింపిక్స్‌ మెడల్‌ అందించిన స్టార్‌ షట్లర్‌.. పీవీ సింధు టోక్యో పతకానికి మరో వైపున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
వరసుగా రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించడమనేది నా లైఫ్‌లోనే ఒక అపూర్వ ఘట్టం. థర్డ్‌ ప్లేస్‌ మ్యాచ్‌లో నెగ్గగానే ఐదారు సెకన్ల పాటు నా చుట్టు ఏం జరుగుతుందో తెలియలేదు. కోచ పార్క్‌ను హగ్‌ చేసుకొని కృతజ్ఞతలు చెప్పాకా తేరుకున్నా. ఉద్వేగానికి లోనయ్యి.. నేను సాధించానని కోర్టులో బిగ్గరగా అరిచా. ఆ అనుభూతులను మాటల్లో వర్ణించడం కష్టం.

కన్నీళ్లు ఆగలేదు..
సెమీస్‌లో చైనీస్‌ తైఫీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో పోరులో ఓడిపోయాక ఏడ్చేశా. ఆ టైమ్‌లో కోచ పార్క్‌ నా దగ్గరకొచ్చి ధైర్యం చెప్పాడు. ఈ మ్యాచ్‌తో ఒలింపిక్స్‌ పోరాటం ముగిసిపోలేదని.. తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని నన్ను సముదాయించాడు. బ్రాంజ్‌ మెడల్‌ సాధించడానికి.. నాలుగో ప్లేస్‌లో నిలవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అతడు చేసిన హితబోధ నా మనసును బలంగా తాకింది. వెంటనే నా దృష్టిని సెమీస్‌ ఓటమి నుంచి తర్వాతి జరగబోయే థర్డ్‌ ప్లేస్‌ మ్యాచ్‌ వైపు మరల్చాను. భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకుని చివరి మ్యాచ్‌లో నా శక్తి సామర్థ్యాలన్ని పణంగా పెట్టి ఆడి మెడల్‌ సొంతం చేసుకున్నా అని సింధు తెలిపింది. ఇక‌పోతే, పారిస్‌లో జ‌ర‌గ‌నున్న 2024 ఒలింపిక్స్ లో కూడా క‌చ్చితంగా ఆడ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని సింధు చెప్పింది. అయితే, దానికి చాలా స‌మ‌య‌మున్నందున ప్ర‌స్తుతానికి మెడ‌ల్ సాధించిన ఈ మ‌ధుర క్ష‌ణాల‌ను కొద్ది రోజులు ఆస్వాదిస్తాన‌ని సింధు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: