ఏపీ సీఎం చంద్రబాబు.. మరి ప్రతిపక్ష నేత ఎవరు.. ఇంకెవరు చంద్రబాబే అంటారా.. ఆ విషయం మాకూ తెలుసు.. కానీ.. అసలు ప్రతిపక్ష నేత అనే కోణంలో ఆలోచిస్తే.. చంద్రబాబును మించి మరో నేత ఆ పదవికి అర్హుడేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే.. అసలు ప్రతిపక్షనేత అంటే ఎవరు.. ప్రభుత్వం తప్పులు నిలదీసేవాడు.. ప్రభుత్వం తప్పుడు విధానాలు అమలు చేస్తుంటే.. హెచ్చరించేవాడు.. ప్రభుత్వం తప్పుదారిన పోకుండా ప్రయత్నించేవాడు.. ఇంతే కదా.. ఇప్పుడు అలా ఆలోచిస్తే ఏపీలో చంద్రబాబు కంటే అసలైన ప్రతిపక్ష నేత ఎంపీ రఘురామ కృష్ణంరాజేమో అనిపించక మానదు.


ఎందుకంటే.. రోజూ  నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఠంచనుగా ఒంటి గంటకల్లా ప్రెస్‌మీట్‌లో అందుబాటులో ఉంటాడు.. రోజుకో టాపిక్ ఎత్తుకుని జగన్ సర్కారును కడిగిపారేస్తారు.. అదేదో మళ్లీ విమర్శించినట్టుగా కాకుండా వినమ్రతతో చెబుతాడు. అంతే కాదు.. ఆయన లేవనెత్తే లాజిక్కులు అటు టీడీపీ వాళ్లు కూడా ప్రస్తావించరు. అంత క్లారిటీగా వుంటాయి ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శలు. అంతే కాదు.. ఆయన జగన్ సర్కారు తప్పదాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తుంటాడు. ఏమాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడు.


తాజాగా.. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారో బయటపెట్టాలంటూ ప్రెస్ మీట్‌ పెట్టి లాజిక్‌ లాగారు. సిబిఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌మాండవీయాకు లేఖ కూడా రాశాడట. అన్నీ పరిశీలించాల్సి నిర్ణయం తీసుకుంటానని సదరు మంత్రిగారు చెప్పారట. ఇదే సమయంలో అమరరాజా కంపెనీలో కాలుష్యం గురించి కూడా ప్రస్తావించారు ఎంపీ రఘురామ.


ప్రజల ఆరోగ్యం గురించి అంత పట్టింపు ఉంటే.. ప్రభుత్వ సరఫరా మద్యం వల్ల పాడవుతున్న ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు.. లాజిక్కే కదా.. ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్ల ఎంత మంది కాలేయం దెబ్బతిన్నదో... అమరరాజ సంస్థ వల్ల ఎంత మందికి దెబ్బతిన్నదో వివరాలు సేకరిస్తే నిజాలు బయటికి వస్తాయని సెటైర్ వేశారు. మరి ఇన్ని లాజిక్కులు లాగుతున్న రఘురామని ప్రతిపక్షనేత అంటే తప్పేముంది..?


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR